SAKSHITHA NEWS

బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు

…..

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్ల రాష్ట్రంలో తాగు, సాగు నీటి ఇబ్బందులు తలెత్తి, పంటలు ఎండిపోయి ప్రజలు, రైతులు అల్లాడిపోతున్నారని బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. కొణిజర్ల మండలం తీగల బంజరలో ఎంపీ నామ పర్యటించి, ఎండిపోయిన మొక్కజొన్న చేలను ఎమ్మెల్సీ తాతా మధు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నామ మీడియాతో మాట్లాడుతూ గత పదేళ్ళలో ఎన్నడూ ఈ దుస్థితి లేదని అన్నారు. ఉన్నకాస్త పొలంలో మొక్కజొన్న సాగుచేస్తే నీళ్ళందక ఎండిపోయిందని బాధిత రైతు భూక్య శ్రీను దంపతులు ఆవేధన వ్యక్తం చేశారని చెప్పారు.నష్ట పోయిన రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు రైతు పక్షంగా ఉండి, పోరాడుతానని స్పష్టం చేశారు. ముందస్తు కార్యాచరణ లేకపోవడం వల్లనే ఈ దుస్థితి దాపురించిందని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తనను మంచి మెజార్టీతో గెలిపించి, పార్లమెంట్ కు పంపిస్తే ఖమ్మం జిల్లా వాణిని లోక్ సభలో వినిపించి, జిల్లా మరింత అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఇప్పటివరకు రాజకీయలకతీతంగా పని చేసి,తెలంగాణా, ఖమ్మం జిల్లా అభివృద్ధికి పని చేశానని గుర్తు చేశారు.నీళ్లు, పెండింగ్ నిధులు, ప్రాజెక్టులు కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశానని అన్నారు. ఈ కార్యక్రమంలో కొణిజర్ల జడ్పీటీసీ పోట్ల కవిత , శ్రీయుతులు ముత్యాల సత్యనారాయణ, బాణాల వెంకటేశ్వరరావు, కట్టా కృష్ణార్జునరావు, వనమా విశ్వేశ్వరరావు , చల్లా మోహన్ రావు,డాక్టర్ కాపా మురళి, బోడేపూడి బాబు, పారుపల్లి రవి, విజయ్, వీరన్న,పొగుల శ్రీను, పాసoగులపాటి శ్రీను, బోడపోతుల బాబు,దరిపల్లి రామారావు, భూక్యా మాన్ సింగ్, రవీందర్ , చిత్తారు సింహాద్రి యాదవ్, మోరంపూడి ప్రసాద్, చీకటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

పోట్ల శ్రీనుకు నామ పరామర్శ

జడ్పీటీసీ కవిత భర్త , బీఆర్ ఎస్ నాయకులు పోట్ల శ్రీను అనారోగ్యంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసి ఎంపీ నామ నాగేశ్వరరావు వారి ఇంటికి వెళ్లి శ్రీనును పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి, నామ భరోసా కల్పించారు.

వరప్రసాద్ కు నామ నాగేశ్వరరావు పరామర్శ

ఖమ్మం ఉపేంద్రయ్య నగర్ లో నివాసం ఉంటున్న ఖమ్మం రూరల్ జడ్పీటీసీ యండవల్లి వరప్రసాద్ ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. ఎంపీ నామ నాగేశ్వరరావు ఖమ్మంలోని వారింటికి వెళ్లి, ఆయన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు బెల్లం వేణు, చిత్తారు సింహాద్రి యాదవ్, ముత్యాల వెంకట అప్పారావు , చీకటి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 04 01 at 5.31.07 PM

SAKSHITHA NEWS