SAKSHITHA NEWS

Srirampur Police Station Area Under Surveillance*

రామగుండం పోలీస్ కమిషనరేట్

నిఘా నీడలో శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధి*

నేరాల నియంత్రణ, కేసులు ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్రపోషిస్తాయి: మంచిర్యాల ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.,

40 సిసి కెమెరాలు ను ప్రారంభించిన మంచిర్యాల ఇన్చార్జి డిసిపి

సాక్షిత : రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, ప్రధాన రహదారులలో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక టెక్నాలజీ తో ఏర్పాటు చేసిన 40 సిసి కెమెరాలను శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ అవరణలో మంచిర్యాల జోన్ ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్ ఐపిఎస్, ఏసీపీ జైపూర్ నరేందర్ లతో కలిసి ప్రారంభించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ప్రాంతాలను వీడియోల ద్వారా వీక్షించారు.

ఈసందర్బంగా ఇంచార్జ్ డిసీపీ మాట్లాడుతూ… పోలీసు వ్యవస్థను పటిష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఎక్కడ ఎలాంటి నేరాలు జరిగినా తక్షణమే స్పందించేలా పోలీస్ స్టేషన్ పరిధిలో నూతనంగా 40 సిసి కెమెరాలను సింగరేణి వారి సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగింది అని కెమెరాల ఏర్పాటుతోపాటు వాటి పనితీరును ఎప్పటికప్పుడూ పర్యవేక్షించేందుకు పోలీసు స్టేషన్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు నిఘా నేత్రల నీడ లో నేరాల నియంత్రణ పై పోలీసు శాఖ దృష్టి సారించింది అన్నారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కెమెరాలు నిరంతరం ప్రతీ దృశ్యాన్ని రికార్డు చేస్తాయని అన్నారు. రాత్రి వేళల్లోనూ దృశ్యాలను స్పష్టంగా చిత్రీకరిస్తాయని నేరస్తులను గుర్తించడానికి, ఏదైనా సంఘటన జరిగిన వెంటనే నేరస్తులను పట్టుకోవడానికి ఈ కెమెరాలు ఉపయోగపడుతాయని సిపి అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా వాటి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా పోలీసుస్టేషన్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. నేరాలపైనే ప్రత్యేక దృష్టితో పాటు ట్రాఫిక్ సమస్యలపై నిఘా పెడుతూ పరిస్థితులను అదుపు చేసేలా కార్యాచరణ చేపట్టామని డీసీపీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జైపూర్ ఏ‌సి‌పి నరేందర్, శ్రీరాంపూర్ సీఐ బి. రాజు, శ్రీరాంపూర్ ఎస్ఐ మానస, సింగరేణి జి ఎం సంజీవ్ రెడ్డి , నస్పూర్ మున్సిపల్ కమీషనర్ రమేష్, చైర్మన్ ప్రభాకర్ , వైస్ చైర్మన్ శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS