
ఘనంగా “శ్రీనిధి గ్లోబల్ స్కూల్” యాన్యువల్ డే సెలబ్రేషన్స్ …
మన చరిత్ర, సంస్కృతి – సాంప్రదాయాలను నాటక ప్రదర్శన ద్వారా నేటి తరానికి తెలిసేలా విద్యార్థులను ప్రోత్సహించిన శ్రీనిధి గ్లోబల్ స్కూల్ యాజమాన్యానికి నా అభినందనలు : ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ …
ఐడిపిఎల్ లోని ఎంపిఆర్ కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించిన శ్రీనిధి “గ్లోబల్ స్కూల్ అన్యువల్ డే” వేడుకలకు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో 30 నిమిషాల నిడివితో ప్రదర్శించిన “సంపూర్ణ రామాయణం” నాటక ప్రదర్శన ఆహుతులను ఎంతగానో ఆకర్షించింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ… మన చరిత్ర, సంస్కృతి – సాంప్రదాయాలను నేటి తరానికి తెలిసేలా సంపూర్ణ రామాయణం నాటక ప్రదర్శనలో విద్యార్థులను ప్రోత్సహించిన పాఠశాల యాజమాన్యానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు నా అభినందనలు. విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల ప్రత్యేక శ్రద్ధ ఎంతో అవసరమని అన్నారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని శాలువా, మెమెంటోతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, నాయకులు ఎర్వ సాయి కిరణ్, శ్రీనిధి గ్లోబల్ స్కూల్ చైర్మన్ డాక్టర్. నల్లపాటి వెంకటేశ్వరరావు, ప్రెసిడెంట్ నల్లపాటి రాజేశ్వరి, డైరెక్టర్ నల్లపాటి సాయినాథ్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్ధుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app