SAKSHITHA NEWS

Sri Sri Umaramalingeswara Panchayat Devasthanam, Bezzipuram.

శ్రీ శ్రీ ఉమారామలింగేశ్వర పంచాయతన దేవస్థానం,బెజ్జిపురం..
6వ వార్షికోత్సవం భాగంగా శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జిపురంలో శ్రీ శ్రీ శ్రీ ఉమారామలింగేశ్వర దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ ఆరవెల్లి సురేష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో శుక్రవారం పూజా కార్యక్రమం నిర్వహించారు.
వాయిస్ : గ్రామ సంకల్పము విగ్నేశ్వర పూజ,పుణ్య వాహచనము, శ్రీ ఉమారామలింగేశ్వర పంచయతన దేవతా ఉత్సవమూర్తుల గ్రామ ప్రదక్షిణ,పంచయతన దేవతలకు షోడశోపచార పూజలు,మహాన్యాస పూర్వక ఏకవార అభిషేకము,రుద్ర హోమము,మూలమంత్ర హోమము, సూర్యనమస్కారాలతో 301 కలశాలతో జల అభిషేకము జరిగింది.శ్రీ శివ పార్వతీ దంపతులను చీర,సారెలతో గ్రామ పురవీధులలో ఊరేగింపు జరిగింది.ఈ కార్యక్రమంలో లావేరు మండల బిజెపి అధ్యక్షుడు ఇజ్జాడ శ్రీనివాసరావు దంపతులు,మాజీ MPTC దన్నాన శ్రీనివాసరావు దంపతులు,ఇజ్జాడ అప్పారావు దంపతులు,కమిటీ సభ్యులు తదితర భక్తులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS