SAKSHITHA NEWS

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదిన సందర్భంగా హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హుడా కేఫ్ చౌరస్తా లోని శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవస్థానంలో జరిగిన బోనాల ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా ప్రజలందరికి బోనాల పర్వదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని, అమ్మ వారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటున్నాను అని, ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వాడవాడలో బోనాల జాతర వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవలనే ఉద్దేశ్యం తో నియోజకవర్గం లోని ప్రతి గుడికి బోనాల నిధులు మంజూరయేలా కృషి చేశానని ,బోనాలు అంగరంగ వైభవంగా జరుపుకునేల  బోనాలు నిర్వహించుకొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరుచేయడం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాని,గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాల అంగరంగా వైభవంగ పండుగల జరుపుకునేల కృషి చేస్తున్నారు అని , ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అన్ని రంగాలలో తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి కెసిఆర్    ముందుకు తీసుకెలుతున్నారని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు.

బోనాల సందర్భంగా ప్రతి గుడి వద్ద అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేశామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండ అన్ని రకాల వసతులు కలిపిస్తూ ప్రశాంత వాతావరణం కలిపించమని, బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగేల అన్ని ఏర్పాట్లను చేశామని, బోనాల పండుగ మంచి ప్రశాంత వాతావరణంలో జరిగినవి అని ప్రభుత్వ విప్ గాంధీ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు దొంతి శేఖర్ , విమల్ కుమార్ ,నరేందర్ బల్లా తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS