శంకర్పల్లి పరిధిలోని కొండకల్ గ్రామంలో శ్రీరాముడి అభిషేక పూజలు చెసారు. అయోధ్య రామ జన్మభూమిలో “రామ మందిరంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట” కార్యక్రమం సందర్భంగా కొండకల్ గ్రామం లో శ్రీరామ మందిరంలో శ్రీ సీతరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. 500 సంవత్సరాల హిందువుల కల నెరవేరింది. ఆలయంలో పెద్ద ఎత్తున రాములోరి కార్యక్రమాలు జరిగాయి. ఉదయం నుండి
మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రత్యేక ఊరేగింపులు, భజన కార్యక్రమాలు, అభిషేకాలు, శ్రీరామ పూజిత అక్షింతలచే ఆశీర్వచనాలు జరిగాయి.
శ్రీ రామ మందిర ఆవరణలో ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. శ్రీరాముడిపై యావత్ భారతావనికి ఉన్న భక్తిని ప్రజలు చాటుకున్నారు.
గ్రామం లొ ప్రజలంతా ఆధ్యాత్మిక చింతనతోపాటు శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రత్యేక ఆసక్తిని కనబరిచారు. పట్టణంలోని ప్రధాన రోడ్లు, కాలనీ రోడ్లన్నీ కాషాయ జెండాలతో నిండిపోయాయి. భక్తులకు అన్నదానం ఏర్పాటు చెసారు, శ్రీ సీతరాములను ఇంటికి ఆహ్వానించి, టపాసులు కాల్చి, మరో దీపావళిని జరుపుకున్నారు. ప్రతి ఇంటి ముందు ఐదు నూనె దీపాలు వెలిగించారు. అయోధ్య నుండి ఇంటికి వచ్చిన అక్షింతలు తలపై వేసుకొని పెద్ద వారితో ఆశీర్వాదాలు తీసుకున్నారు.