ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో నాగులవంచ శ్రీ ఆదర్శ విద్యాలయం విద్యార్థులు అత్యధిక ప్రతిభ కనపరిచారు. పాఠశాల విద్యార్థుల్లో రౌతు మోనోవర్ష, పండగ లోహిత్ ఇద్దరు విద్యార్థులు 9.7 జీపీఏ సాధించారు. మాగం అనూష 9.5 జీపీఏ, కందిమళ్ళ శ్రీవిద్య 9.3 జీపీఏ, గార్లపాటి భరత్ 9.3 జీపీఏ, బంధం వర్షిత 9.2 జీపీఏ, వల్లకాటి పూజ 9 జీపీఏ సాధించారు. పాఠశాలలో చదివిన విద్యార్థుల్లో 7గురు విద్యార్థులు 9 + గ్రేడ్ పాయింట్లు సాధించగా… 18 మంది విద్యార్థులు 8+ జీపీఏ సాధించారు. తెలుగు సబ్జెక్టులో 11 మంది విద్యార్థులు 10 జీపీఏ, సోషల్ లో ఏడుగురు విద్యార్థులు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ లో 11 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విజయం సాధించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ బోడేపూడి కిరణ్, ప్రిన్సిపల్ చావా అరుణ్ కుమార్ అభినందించారు.