SAKSHITHA NEWS

సాక్షిత : మూసాపేట్ లోని రాయల్ ఫంక్షన్ హాల్ నందు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్య మంత్రి కేసిఆర్ అధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి..సంక్షేమ పనులు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. మూసాపేట్ డివిజన్ ను వందల కోట్ల రూపాయల తో అభివృద్ధి పనులు పూర్తి చేశామని, ఎంపీ గా గెలిచిన రేవంత్ రెడ్డి ఎటు వెళ్ళాడో అని, అలాగే గెలిపిస్తే అన్ని ఉచితంగా ఇస్తా అన్న బీజేపీ ఏమైంది అని అన్నారు. దళిత బందు పార్టీలకు అతీతంగా అందించామని గుర్తు చేశారు. మన రాజ్యాంగం రచించిన గొప్ప మహానుభావుడు అంబేత్కర్ పేరు పార్ల మెంట్ కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. మూసాపేట్ లో రోడ్లు, డ్రైనేజ్ నాళాల అభివృద్ధి వందల కోట్ల రూపాయలతో జరిగాయని దీనంతటిని కూడా ప్రజలు గమనించాలని, జరుగుతున్న అభివృద్ధిని ప్రతి ఒక్కరికి తెలిపేటట్లు చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని తెలియజేశారు..

అలాగే అత్యధికంగా మూసాపేట్ డివిజన్ లో ఆసరా పింఛన్లు అందించడం జరుగుతుందని ప్రాంతం ఏదైనా సరే అందరూ మన బిడ్డల్లాగే చూసుకుంటున్నామని. ఈ ప్రాంతంలో ఎక్కువగా నివసించే శ్రీకాకుళం, ఒరిస్సా ప్రాంతవాసులను తమ బిడ్డల లాగే పరిగణించి వారికి అన్ని సౌకర్యాలు కల్పించి ఏదైనా ఇబ్బంది ఉన్న ఎడల సమస్యను పరిష్కరించి వారికి అండగా ఉంటున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఐడిపిఎల్ స్థలం కేటాయిస్తే ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ కేటాయించే బాధ్యత తీసుకుంటానని ఈ సందర్భంగా గుర్తు చేశారు.. ఈ కార్యక్రమంలో.. కోఆర్డినేటర్ సతీష్ అరోరా.. మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్.. పగుడాల బాబురావు నరేంద్ర చారి.. డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు.. ప్రభాకర్ గౌడ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS