కోల్ నాలా పనుల్లో వేగంగా పెంచండి.. ఎస్.ఎన్.డి.పి అధికారులు, విడివి కాంట్రాక్టు సంస్థపై ఎమ్మెల్యే ఆగ్రహం…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్లలో కోల్ నాలా పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పరిశీలించారు. పనులు నత్తనడకన సాగడంతో ఎస్.ఎన్.డి.పి అధికారులు, సదరు విడివి ప్రాజెక్ట్స్ బెంగళూరు సంస్థ వారిపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో పనులు పూర్తి చేయకపోవడంతో వరదల వల్ల ముంపు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ప్రజల ఇక్కట్లు దృష్టిలో ఉంచుకుని యుద్ధ ప్రాతిపదికన పనుల్లో వేగం పెంచి పూర్తి చేయాలన్నారు. లేదంటే పై అధికారులతో సమీక్షించి సకాలంలో పూర్తి చేసే మరొక ఏజెన్సీకి పనులు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం వద్ద జోనల్ కమిషనర్ మమత , ఎస్.ఎన్.డి.పి సీఈ వసంత మరియు జిహెచ్ఎంసి ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే సమావేశమై ముంపు ప్రాంతాలైన స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ, మీనాక్షి ఎస్టేట్స్, ఎన్సియల్ కాలనీ, క్యాంటన్ పార్క్, శివారెడ్డి నగర్, వెంకన్న హిల్స్, సాయినగర్, శ్రీనివాస్ నగర్, వెంకటేశ్వర నగర్ కాలనీ, గాయత్రి నగర్, గోదావరి హోమ్స్ తదితర కాలనీల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద నీటి సమస్య లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటూ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ లు ప్రశాంతి, మంగతాయారు, ఎస్.ఎన్.డి.పి ఎస్ఈ ఆనంద్, జిహెచ్ఎంసి ఎస్ఈ చెన్నారెడ్డి, ఈఈ నారాయణ, డిఈఈ నరేందర్, ఏఈ రామారావు, జిహెచ్ఎంసి ఈఈలు కృష్ణ చైతన్య, గోవర్ధన్ మరియు డిఈఈలు, విడివి ప్రాజెక్ట్స్ బెంగళూరు సంస్థ వారు పాల్గొన్నారు.