specially able people should take advantage of ten rupees meal
పది రూపాయలకే భోజనాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..*
సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్
రంగారెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి
పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం శ్రీ రామలింగేశ్వర సహకార సంఘం ఉపాధ్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో అందిస్తున్న పది రూపాయల భోజనాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు నెంబర్ డాక్టర్ కొండా చంద్రశేఖర్ గౌడ్ కోరారు. పట్టణంలోని విజయనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన పది రూపాయల భోజనం కార్యక్రమాన్ని శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పది రూపాయలకే భోజనాన్ని అందజేయడం గొప్ప విషయం అని వారిని అభినందించారు.
ఈ భోజన కార్యక్రమానికి ఆయన తన వంతుగా 1100 రూపాయలను విరాళంగా అందజేశారు. అదేవిధంగా వైట్ల గోపాలక్రిష్ణ 2500/-రూ, బూత్పూర్ జడ్ పి హెచ్ ఎస్ పి.డి సూర్యప్రకాష్ 1000/-రూ॥మరియు సుశీల శ్రీశైలం గౌడ్ మనవరాలు అనుపమ పుట్టిన రోజు సందర్భముగా 500/-రూ విరాళముగా అందచేశారు. ఈ కార్యక్రమములో ఆశంబాబు, బుచ్చయ్య, తిరుపతయ్య, బ్రహ్మయ్య, జాన్సన్, క్రాంతికుమార్, నందిగామ సురేష్ కుమార్, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.