SAKSHITHA NEWS

ప్రత్యేక అధికారులు వెంటనే బాధ్యతలు స్వీకరించాలి

  • జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ శుక్రవారం, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి కొనిజర్ల మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వి. వెంకటాయపాలెం, తనికెళ్ల గ్రామ. పంచాయతీల తనిఖీ చేసి, ప్రత్యేక అధికారులు బాధ్యతలు తీసుకున్నది పరిశీలించారు. ప్రత్యేక అధికారులు వివిధ గ్రాంట్లకు సంబంధించి నగదు పుస్తకాలు, సాధారణ నిధులు, ఉపాధి హామీ నిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే మంజూరయిన నిధులు, సమావేశాలు, గ్రామ సభల రిజిషర్లు తదితరాలన్ని పరిశీలించి తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా రిజిస్టర్ల నమోదులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి హరికిషన్, డివిజనల్ పంచాయతీ అధికారి పుల్లారావు, కొనిజర్ల ఎంపిడివో మహాలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు శ్రీధర్ రెడ్డి, మురళీకృష్ణ, అధికారులు తదితరులు ఉన్నారు.

WhatsApp Image 2024 02 02 at 8.54.01 PM

SAKSHITHA NEWS