SAKSHITHA NEWS

అందుకే 5రోజుల పాటు పట్టణంలో పాదయాత్ర

ప్రతి వార్డులో గల సమస్యలు తెలుసుకుంటాం

లాంఛనంగా పాదయాత్రను ప్రారంభించిన పరిటాల శ్రీరామ్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ధర్మవరం పట్టణం కోసం ప్రత్యేకంగా ఒక మ్యానిఫెస్టో రూపొందిస్తున్నట్టు నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ తెలిపారు. పట్టణంలోమొత్తం ఐదు రోజుల పాటు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బుధవారం రోజు పట్టణంలోని శివానగర్ లో ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 7వ వార్డులో లాంఛనంగా పాదయాత్రను ప్రారంభించారు. అలాగే స్థానిక నాయకులు కార్యకర్తలతో బాబు ష్యూరిటీ- భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓ వైపు సమస్యలు తెలుసుకుంటూ మరోవైపు మినీ మ్యానిఫెస్టోలోని పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. కాలనీలో ఏ సమస్యలు ఉన్నాయి..

వాటిని పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. వాటికి ఎంత వరకు వ్యయం కావచ్చు.. ఇలాంటి అంశాలన్నీ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని మినీ మ్యానిఫెస్టోని రూపొందించారన్నారు. అదే స్ఫూర్తితో స్థానికంగా ఉన్న సమస్యల మీద కూడా మ్యానిఫెస్టోను రూపొందించుకుంటున్నట్టు తెలిపారు. ఇదేదో నలుగురు నాయకులను పిలిచి మాట్లాడి తయారు చేయడం లేదని.. స్థానికంగా ప్రతి కాలనీకి వెళ్లి అక్కడ సమస్యలు తెలుసుకున్న తర్వాత మాత్రమే మ్యానిఫెస్టో రూపొందిస్తున్నట్టు వివరించారు.

04/01/2024 గురువారం రోజున ఉదయం 9 గంటలకు గుట్టకిందపల్లి సెంటర్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని.. అలాగే 5వ తేదీ శాంతి నగర్ గ్యాస్ గోదాం నుంచి, 6వ తేదీ పోతుకుంట రోడ్డులోని అన్నపూర్ణేశ్వరి ఆలయం వద్ద నుంచి, 7వ తేది కన్యకాపరమేశ్వరి ఆలయం నుంచి, 8వ తేది యాదవ వీధి ఈశ్వరుని గుడి వద్ద నుంచి ప్రారంభమవుతుందన్నారు. మొత్తం 40 వార్డుల్లోనూ ఈ పాదయాత్ర ఉంటుందన్నారు. 8వ తేదీ ధర్మవరం పట్టణంకు తాము ఏం చేయబోతున్నామన్నది ప్రకటిస్తామన్నారు. రేపు టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తాము ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా ముందుకెళ్తామన్నారు. ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు….

WhatsApp Image 2024 01 03 at 2.08.25 PM

SAKSHITHA NEWS