ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యం – యస్.పి అపూర్వ రావు
గ్రీవెన్స్ లో పలు ఫిర్యాదులను పరిశీలించిన యస్.పి
పోలీస్ గ్రీవెన్స్ డే తో బాధితులకు బరోసా
బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం
నల్లగొండ (సాక్షిత ప్రతినిధి)
ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ అపూర్వరావు ఐ.పి.యస్ అన్నారు. ప్రతి ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 35 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. భూ సమస్యలు, భార్య భర్తల మధ్య సమస్యలు, ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేశాడని, ఫైనాన్స్ సమస్యల పైన పిర్యాదులు రావడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా యస్. పి మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని, ఫిర్యాదుదారునికి భరోసా, నమ్మకం కలిగించాలని అన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరకమైన చర్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల వ్యవహరించాలని అన్నారు. బాధితుల యొక్క ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.