రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక,ఆర్థిక,విద్య,ఉపాధి,రాజకీయ మరియు కుల సర్వే కార్యక్రమాన్ని మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి కమిషనర్ సాబేర్ అలి ,NMC ఆయా విభాగాల అధికారులతో కలిసి 12వ డివిజన్ పరిధిలో ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఈ సర్వే ద్వారా సామాజిక,ఆర్థిక,విద్య, ఉపాధి,రాజకీయ మరియు కుల సమగ్ర సర్వే నిర్వహించి, ప్రతి కుటుంబం యొక్క సామాజిక ,ఆర్థిక స్థితి,విద్యా స్థాయి,ఉపాధి పరిస్థితులు,రాజకీయ ప్రయోజనం, కుటుంబం ఆర్థిక పరిస్థితి పై సర్వే నిర్వహించనున్నారని,ఇక సర్వే ద్వారా చేపట్టిన సమగ్ర సమాచారం ఆధారంగా రానున్న రోజుల్లో ప్రభుత్వం పలు పథకాలు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుందని,వివిధ పథకాలకు ఎవరు అర్హులో తెలుసుకొని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలియజేస్తూ…రాష్ట్ర ప్రభుత్వానికి,ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదములు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, NMC ఆయా విభాగాల అధికారులు,సిబ్బంది,స్థానిక డివిజన్ నాయకులు,ఆయా కాలనీ వాసులు,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక,ఆర్థిక,విద్య,ఉపాధి,
Related Posts
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తాం – మాజీ ఎమ్మెల్యే, శ్రీశైలం గౌడ్
SAKSHITHA NEWS కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తాం – మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్.. కుత్బుల్లాపూర్ నియోజక వర్గం: మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ ని తన నివాసం వద్ద…
ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్
SAKSHITHA NEWS ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్ శంకర్పల్లి: ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలని శంకర్పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్ అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో వైద్య అధికారులతో…