SAKSHITHA NEWS

సామాజిక తాత్వికుడు అంబేడ్కర్ – వడ్త్య దేవేందర్ నాయక్

దేవరకొండ సాక్షిత ప్రతినిధి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మే 25న డిగ్రీ పట్టా పొందిన సందర్భంగా దేవరకొండ పట్టణంలో ప్రజాసంఘాల జేఏసీ నాయకులు మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ తో కలిసి మాజీ మున్సిపల్ చైర్మన్
వడ్త్య దేవేందర్ నాయక్
పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఉన్నత విద్యావంతుడని అతను కొలంబియా విశ్వ విద్యాలయం నుండి న్యాయ పట్టా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి పీహెచ్ డి సహా పలు డిగ్రీలను పొందాడని గుర్తు చేశారు. సమాజం యొక్క పురోగతి మరియు సాధికారత కోసం విద్య చాలా అవసరమని అంబేడ్కర్ నమ్మారు అందువల్లనే ఆయన జీవితాంతం విద్య యొక్క ప్రాముఖ్యతను పలుమార్లు వ్యక్తం చేసేవారని అన్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడని, ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాథమికమైన సమానత్వం, సామాజిక న్యాయం మరియు ప్రాథమిక హక్కుల సూత్రాలను రాజ్యాంగంలో చేర్చాడానికి అంబేడ్కర్ తీవ్రంగా కృషి అన్నారు.

భారతదేశంలో దళితులు ఎదుర్కొంటున్న వివక్షత, సామాజిక బహిష్కరణను ప్రత్యక్షంగా అనుభవించిన అంబేడ్కర్ తన జీవితాంతం దళితుల హక్కులు, అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా పోరాడాడని అన్నారు. అదే విధంగా దళితుల సామాజిక, విద్య మరియు ఆర్థిక సాధికారత కోసం పాటు పడ్డారని అన్నారు. కులాల నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి గౌరవంగా జీవిస్తూ సమాన అవకాశాలను పొందగలిగే సమాజాన్ని సృష్టించే దిశగా ఆయన కృషి చేశారని అన్నారు. భారతదేశం యొక్క సాంఘిక, రాజకీయ నిర్మాణానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి ముఖ్యమైనది అన్నారు. అతని ఆలోచనలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను నేడు ఆలోచింప జేస్తున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల జేఏసీ నాయకులు కంబాలపల్లి వెంకటయ్య, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ భవనం నిర్వహణ కమిటీ అధ్యక్షులు పొట్ట మురళి మాజీ కౌన్సిలర్ పొట్ట సుగుణయ్య, దళిత రత్న అవార్డు గ్రహీత ఎర్ర ఆంజనేయులు, అంకూరి దానయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్, గౌడ్ వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ నాయకులు కంబాలపల్లి వెంకటయ్య, మాతంగి శ్రీను, నల్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS