బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా డి.సీతారామిరెడ్డి.
రెడ్డి సామాజిక వర్గం నుంచి మొదటి చైర్మన్.
సీతారామి రెడ్డి గారికి మాజీ డిప్యూటీ స్పీకర్ శాసనసభ్యులు కోన పుట్టినరోజు కానుక.
బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా డి.సీతారామిరెడ్డి.
రెడ్డి సామాజిక వర్గం నుంచి మొదటి చైర్మన్. ఎప్పటినుంచో వైసీపీ పార్టీ కర్లపాలెం మండల కన్వీనర్ గా, ముఖ్యంగా మాజీ డిప్యూటీ స్పీకర్, శాసనసభ్యులు కోన రఘుపతి కి విధేయుడుగా ఉంటూ ఆయన ఏ పని చెప్పిన తూచా తప్పకుండా పాటించే వ్యక్తిగా పేరు ఉన్న కర్లపాలెం మండల వైసీపీ కన్వీనర్ డి సీతారామిరెడ్డిని బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చేస్తున్న మొదటి వ్యక్తి సీతారామిరెడ్డి కావటం విశేషం. దీనిపై బాపట్ల నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి శాసనసభ్యులు కోన రఘుపతి ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్లు అయ్యింది. అంతే కాకుండా ఎంతోమంది.. కొన్ని సామాజిక వర్గాల వారు ముందుకు వచ్చి ఎంత ఖర్చైనా పర్లేదు మార్కెట్ యార్డ్ చైర్మన్ మాకు ఇవ్వండి అని ముందుకు వచ్చిన కూడా సున్నితంగా వారిని తిరస్కరించి, ఇచ్చిన మాటకు కట్టుబడి రెడ్డి సామాజిక వర్గం నుంచి వైసీపీ పార్టీకి విధేయుడుగా ఉన్న డి.సీతారామరెడ్డిని బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమించారు.
ఇప్పటివరకు బీసీ సామాజిక వర్గం నుంచి గవిని కృష్ణమూర్తిగారు బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన పదవీకాలం అనంతరం రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తూ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఆ సామాజిక వర్గానికి ఇవ్వటం ద్వారా ఇప్పటివరకు ఎవరు చేయనటువంటి.. ఎవరు తీసుకొనటువంటి గొప్ప నిర్ణయాన్ని శాసనసభ్యులు కోన రఘుపతి తీసుకొని రెడ్డి సామాజిక వర్గం నుంచి వైసీపీ పార్టీకి విధేయుడుగా ఉంటూ, మాజీ డిప్యూటీ స్పీకర్ శాసనసభ్యులు కోన రఘుపతి కి ప్రధాన అనుచరుడుగా ఉన్న సీతారామిరెడ్డి కి ఈ పదవి కట్టబెట్టడం ద్వారా పార్టీని.. కోన రఘుపతి గారికి నమ్ముకున్న వారికి ఎప్పుడు అండగా నిలబడతారు అని దీని ద్వారా మరొకసారి నిరూపితమైంది. అగ్రవర్ణ సామాజిక వర్గాల వారు ఎంతైనా ఇస్తాం… ఏమైనా చేస్తామని ముందుకు వచ్చిన కూడా వారిని కాదని, నమ్మిన వారికి ఆ పదవి కట్టబెట్టడం ద్వారా మరొక్కసారి శాసనసభ్యులు కోన రఘుపతి గారు ఆయన తాను అందరివాడిని కొందరి వాడిని కాదు అని నిరూపించుకున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా సీతారామిరెడ్డి గారికి ఇంతకంటే గొప్ప పుట్టినరోజు కానుకను ఎవ్వరు ఇవ్వలేరు..ఇవ్వబోరు కూడా.