కేసిఆర్ వల్లనే సీతారామ కల సాకారం
సీతారామ సక్సెస్ పట్ల నామ నాగేశ్వరరావు హర్షం
రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్
………………………………………………………………………………………………….
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
అవిరళ కృషి, భగీరథ అద్భుత ప్రయత్నంతో సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతమై, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల జల సంకల్పం నెరవేరిందని ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నీటితో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షలాది ఎకరాలు సస్యశ్యామలమై, అన్నదాతల కలలు సాకారం అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టు ఘనత కేసీఆర్దేనని పేర్కొన్నారు. కేసీఆర్ ఎంతో ముందు చూపుతో ప్రతిష్టాత్మకంగా తీసికొని ఈ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి, కరవును పారదోలే కల్పతరవుగా ప్రాజెక్టును పూర్తి చేశారని చెప్పారు.ఈ మొదటి దశ పంపు హౌస్ ద్వారా గోదావరి జలాలు ఊరూరా పరుగులిడి, లక్షలాది ఎకరాలకు చేరతాయని అన్నారు.కేసీఆర్ ఉక్కు సంకల్పం వల్లనే ఈ ప్రాజెక్టు కల సాకారమైందని చెప్పారు.ఈ ప్రాజెక్టు ఖమ్మం జిల్లా రైతుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతుందని తెలిపారు.ఈ ప్రాజెక్టు ను జిల్లా రైతాంగానికి అంకితం చేస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలోనే దాదాపు పనులన్నీ పూర్తి అయ్యాయని చెప్పారు.ఈ విజయంలో భాగస్వాములైన నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బందిని కూడా అభినందిస్తున్నట్లు నామ నాగేశ్వరరావు తెలిపారు.