Sitarama project is my goal – Paleru soil smell is my life
“సీతారామప్రాజెక్టు నా లక్ష్యం-పాలేరు మట్టివాసన నా ప్రాణం అంటున్న తుమ్మల”
నూతన సంవత్సరం ఊరు-వాడలో పల్లేబాటతో పయనించనున్న అభివృద్ధి ప్రదాత
లోడిగ. వెంకన్నయాదావ్. సామాజిక వేత్త. పాలేరు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
గడిచిన అతితక్కువ కాలంలో పాలేరు ముఖచిత్రం మార్చేసిన అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు ఊహించని పరిణామాలతో తన 40 సంవత్సరాల సూదీర్గ రాజకీయ జీవితం అంతరికంగా రాజకీయ కుట్రలతో పాలేరు ఒక్కసారిగా మౌన ముద్ర దాల్చింది. ఇది ఎవరూ ఊహించని పరిణామం అయినప్పటికీ అనేక రాజకీయ పరిణామాలు మార్పులు చెందుతున్నప్పటికి తుమ్మల అభివృద్ధి, తనరాజకీయ జీవితకాలంలో లంచాలకు తావులేకుండా, మచ్ఛలేని నాయకుడిగా , అభివృద్ధి అనే ఏకైక మంత్రం ,నేను ఏమైనా ప్రజలకు మేలు చేయగలనా అన్నతుమ్మల తపన రాజకీయ వేదికపై ఇంతకాలం నిలబెడుతూ వచ్ఛింది
.
దాన్నే నమ్ముకొన్న తుమ్మల పాలేరుపై అపారమైన నమ్మకం పెట్టుకొన్నారు.సత్తుపల్లి, ఖమ్మం నియోజకవర్గ ప్రజలకంటే కూడ ఎందుకో గాని పాలేరు ప్రజలపై అమితమైన విశ్వాసం పెంచుకొన్నారు. అది ఎంతాగా అంటే నాజీవితం పాలేరు ప్రజాసేవలోనే ముంగిచి తరించాలి అన్నంత దృడ సంకల్పంతో ఉన్నారు.
తుమ్మల ఈ రకమైన నమ్మకానికి ఒక బలమైన కారణం కూడ లేకపోలేదు. 70సంవత్సరాల స్వతంత్ర అనంతరం కూడ పాలేరు నియోజకవర్గ ప్రజలకు చెంతనే చెరువు ఉన్నా చింతతప్పని పాలేరు రైతాంగం పై సాగటానికి బొక్కెనెడు నీళ్ళు -తాగటానికి గుక్కెడు నీళ్ళు లేక అలమటిస్తున్న పాలేరు ప్రజానికం త్రాగునీరు సాగునీరు కష్టాలు కళ్ళారచూసి తుమ్మల చలించిపోయారు.
పట్టుబట్టి కేసీఆర్ ను ఒప్పించి ఒక భగీరధ ప్రయత్నం తో భక్తరామదాసు ప్రాజెక్టు అనతి కాలంలోనే పూర్తి చేసి పాలేరు నియోజకవర్గ ప్రజల త్రాగునీరు-సాగునీరు తో పాలేరు ప్రజల ఆనందం కళ్ళార చూశారు.
అది తుమ్మలకు ఎంతగానో తృప్తిని ఇచ్ఛింది. దీనిని పాలేరు రైతాంగం లో ఆనందం కళ్ళారచూసిన తుమ్మల మరో భగీరధ ఆలోచన పుట్టుకొచ్ఛి పాలేరు కు శాశ్వతంగా రైతాంగం సాగునీరు త్రాగునీరు పరిష్కారం కావాలి అని ఆలోచన మొదలైంది.
పాలేరు ప్రజలలో భూమి ఉన్నంతకాలం పాలేరు ప్రజల గుండెల్లో నేను గుర్తుండాలి అంటే పాలేరు నది పారక పోయినా ,ఆకేరునది ఆరిపోయిన ,కృష్ణ జలాలుపాలేరు కు తాకకపోయినా , మున్నేరునది ముంచకపోయినా , వరుడ దేముడు కరుణించ కపోయినా ,దండకా అరణ్యంలోని గోదావరిని మలిచి పాలేరు పొలాల్లోకి నీటిని మల్లించి పాలేరు రైతుల కళ్ళల్లో ఆనందం కళ్ళారాచూసి మురిసిపోవాలి అనే తపన తుమ్మల గుండెల్లో నాటుకు పోయింది.
దీనికి తోడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది లక్షల ఎకరాల సాగునీరుకు ఏకైక మార్గం సీతారామ ప్రాజెక్టు అనే దూరద్రుష్టిని, తన దార్శనికత ను ఆత్మవిశ్వాసం తో కలిగి ఉన్నారు. తద్వారా సీతారామ ప్రాజెక్టు నీటితో పాలేరు ప్రజల పాదాలు కడిగి తృప్తిగా నారాజకీయ జీవితం ముగించాలి అని ఒకేఒక్క ఆలోచనతో తిరిగి నేను పాలేరు లో పోటీచెయ్యాలి అనే ఏకైక లక్ష్యం తుమ్మల మదిలో మెదలాడి పాలేరు మట్టివాసనపై మక్కువ పెంచుకొన్నారు.
ఈ టర్మ్ గెలిచి ఉన్నట్టుంటే ఈ కోరిక ఇప్పుడే తీరిఉండేది. వచ్ఛేఎన్నికల్లో పోటీచేసే అవసరమే ఉండక పోయేది అనే అభిప్రాయం తనమనస్సులో ఉంది. సీతారామప్రాజెక్ట్ నేను తప్ప మరెవ్వరూ పూర్తి చేయుటకు ముందుకు తీసుకు పోలేరు అనే భావనకూడ తన మనస్సులో దృడంగా ఉండటం, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే పాలేరు తో పాటు ఉమ్మడి ఖమ్మంజిల్లా పచ్ఛదనంతో రైతుల మొఖం లో ఆనందం, చిరునవ్వు, ఆర్థికంగా అష్ట అశ్వైర్యాలతో రైతులు పర్వసించి పులకించి పోతుంటే అది చూసి నేను తరించి నా రాజకీయ జీవితం పాలేరులో ముగించాలి అనే బలమైన కోరిక కారణంగానే పాలేరు ను వదులుకొనలేక పోతున్నారు.
దీనివలన పాలేరును బలమైన కేంద్రం గా ఎంచుకొన్నారు.
కాలానుగుణంగా గడిచిన నాలుగు సంవత్సరాలలో పాలేరులో అనేక మార్పుల చోటుచేసుకొంటున్నా ఎక్కడో ఒక చోట తుమ్మలకు అన్యాయం జరిగింది అనేమాట బలంగా వినపడుతుంది.ఎందుకంటే తుమ్మల ఓటమి అనంతరం నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వ పథకాలు తప్ప చెప్పుకోదగిన అభివృద్ధిని ప్రజలు చూడలేక పోయారు. అదే తుమ్మల అయితే ఏదోఒకటి సృష్టించి కేంద్రం నిధులు ,రాష్ట నిధులు పట్టుకొచ్ఛి అభివృద్ధి సృష్టించే వాడు అనే వారి సంఖ్య పెరిగింది.
సీతారామప్రాజెక్టు పూర్తి అయ్యేది అనే మాట రైతుల నోట వినిపించడం ప్రజల్లో మొదలైంది. దీనికి అణుగుణంగానే నా లక్ష్యం సీతారామప్రాజెక్ట్ , నాజాస ,ధ్యాస ఎకైక లక్ష్యం గోదావరి జలాలు పాలేరు ప్రజలపాదాలు కడిగి తుదిశ్వాస పాలేరు మట్టిలో వదలాలి అనే మాట తన సన్నిహితుల వద్ద తరచు తుమ్మల చెపుతున్నారు. దీనిలో భాగంగానే ఆరెంపుల వద్ద శ్రీసిటిలో తన ఇంటిని పాలేరు కార్యాలయం గా ఏర్పాటు చేసుకొని నూతన సంవత్సరం ప్రారంభదినంగా ఎంచుకొని తన అడుగులు పాలేరులో కదిలేవిధంగా ప్రణాళికలు చేసుకొంటున్నారు . తన రాజకీయ నడక నడత తుదిశ్వాస వరకు పాలేరులో అనే సంకేతాలు బలంగా ఇవ్వడానికి నూతన సంవత్సరం నూతన ఉత్తేజం కార్యకర్తలకు భరోసా నింపాలని నిర్ణయించారు.