SAKSHITHA NEWS


Singareni Purudeeksha under the leadership of Ramagundam MLA

రామగుండం ఎమ్మెల్యే సారధ్యంలో సింగరేణి పోరుదీక్ష


బి.జె.పి. హటావో, సింగరేణి బచావో-ఎమ్మెల్యే కోరుకంటి చందర్

సాక్షిత,గోదావరిఖని : కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ కుట్రలో భాగంగా సింగరేణి బొగ్గు గనుల వేలానికి నిరసనగా రామగుండం శాసన సభ్యులు, బి.ఆర్.ఎస్. పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన “సింగరేణి పోరు దీక్ష”ని అన్ని సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు సంఘీభావం తెలిపి విజయవంతం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ


కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ ఎదురించాలని,
కేకే-6, శ్రావనపల్లి, పెనగడప, సత్తుపల్లి బొగ్గు గనుల వేలానికి కేంద్రం కసరత్తు చేస్తుందని దానికి నిరసనగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.


తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసి, తెలంగాణా రాష్ట్రాన్ని చీకటి మయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, దానికి ఐక్యంగా తిప్పికొట్టాలని,
కేంద్రానికి బుద్ది చెప్పేందుకు కె.సి.ఆర్. ఏర్పాటు చేసిన బి.ఆర్.ఎస్. పార్టీని తెలంగాణా ప్రజలు ఆశీర్వదించి బి.జె.పి. ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని అన్నారు. 2015లో యం.యం.పి.ఆర్. జి.ఓ. ని తీసుకొచ్చి బొగ్గు గనులను ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు చేస్తోందని,


ఇక్కడున్న బి.జె.పి. నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ మొదలగు వారు సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో మాట్లాడ కుండా, కేంద్రానికే వత్తాసు పలుకుతూ తెలంగాణ రాష్ట్రన్ని, ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.


ఈ సమస్య సింగరేణి కార్మికుల, వారి కుటుంబాల వినాశనానికే కాదని మొత్తం తెలంగాణా రాష్ట్ర వినాశనానికే అన్నారు, కేంద్ర ప్రభుత్వం చేసే ఇలాంటి నీచపు ఎత్తుగడలను, కుట్రలను
రాష్ట్ర ప్రజలు మొత్తం కలిసి ఎదుర్కొనే సమయం వచ్చిందన్నారు.


ఈ పోరుదీక్షకి టి.బి.జి.కె. ఎస్. సి.ఐ. టి.యు., మొదలగు అన్ని కార్మిక సంఘాలే కాక ఎం.ఆర్.పి.ఎస్., తెలంగాణ ఎస్.సి. , ఎస్.టి. ఎంప్లాయిస్ యనియన్, ముదిరాజ్ సంఘం, యాదవ సంఘం, కాపు సంఘం మొదలగు అన్ని కుల సంఘములు, ఆటో,లారీ,ట్రాక్టర్ ల యూనియన్ సంఘాలతో పాటు సబ్బండ ప్రజలు సంఘీభావం తెలియజేసారు..


SAKSHITHA NEWS