SAKSHITHA NEWS

ప్రజ్ఞా వికాస్ ప్రతిభా పరీక్షలో శ్రీ ఆదర్శ విద్యార్థి ప్రతిభ

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి అనుబంధ ప్రజ్ఞా వికాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్లో పదో తరగతి చదువుతున్న జక్కుల నవనీత్ ప్రధమ బహుమతి సాధించాడు ‌ తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో పాఠశాల విద్యార్థులలో సృజనాత్మకతను వెలుగు తీయడం కోసం వ్యాసరచన, చిత్రలేఖనం, పోటీలు ఇటీవల నిర్వహించినారు. ప్రతి జిల్లా నుండి ఆయా విభాగాల్లో ప్రథమా తృతీయ బహుమతులు సాధించిన ఆరుగురు విద్యార్థులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసినారు. ఖమ్మం జిల్లా నుండి వ్యాసరచన విభాగములో శ్రీ ఆదర్శ విద్యాలయం నాగులవంచ విద్యార్థి జక్కుల నవనీత్ ప్రథమ స్థానం సాధించిచాడు. జిల్లాస్థాయిలో ఎంపిక కాబడిన విద్యార్థులకు సెప్టెంబర్ 2న హైదరాబాద్ ముచ్చింతాల్లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించబడతాయి. అదే రోజు జక్కుల నవనీత్ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా రూ.6 వేలు నగదు పురస్కారం, ప్రశంసా పత్రాన్ని అందుకోనున్నాడు .ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థి నవనీత్ ను పాఠశాల కరస్పాండెంట్ బోడేపూడి కిరణ్ , ప్రిన్సిపాల్ చావా అరుణ్ కుమార్, ఉపాధ్యాయులు అభినందించారు.


SAKSHITHA NEWS