SAKSHITHA NEWS

పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ షాక్‌ ఇచ్చాడు. తన భార్య టీమిండియా టెన్నిస్‌ క్రీడాకారిణీ సానియా మీర్జాతో దూరంగా ఉంటోన్న అతను మరోసారి పెళ్లి పీటలెక్కాడు.

పాకిస్తాన్‌కే చెందిన ప్రముఖ నటి సనా జావేద్‌తో కలిసి శనివారం నిఖా చేసుకున్నాడు. గత కొంత కాలంగా వీరిద్దరూ రిలేషన్‌ షిప్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

అదే సమయంలో సానియాతో షోయబ్‌ విడాకులు తీసుకుంటు న్నట్లు ప్రచారం జరిగింది. అయితే వీటిపై ఎవరూ అధికారికంగా స్పందించిన దాఖలాలు లేవు. కానీ సడెన్‌గా మరోసారి పెళ్లి చేసుకుని షాక్‌ ఇచ్చాడు.

షోయబ్‌. ఇందుకు సంబంధించిన ఫొటోలను షోయబ్‌ నే ట్విట్టర్‌ లో షేర్‌ చేసుకోవడం గమనార్హం. సానియాతో విడాకుల ప్రచారం సాగుతుండగానే షోయబ్‌, సనాల పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

సానియా, షోయబ్‌లది కూడా ప్రేమ వివాహం. ఇద్దరూ 2010లో హైదరాబాద్‌లో ముస్లిం సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు, ఆ తర్వాత పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో వలీమా వేడుక చేసుకున్నారు.

మాలిక్, సానియా మీర్జాలకు 2018లో ఇజాన్ అనే కుమారుడు జన్మించాడు..

Whatsapp Image 2024 01 20 At 1.35.11 Pm

SAKSHITHA NEWS