SAKSHITHA NEWS

మంగళగిరిలో జరిగే టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలకు వెళ్ళేందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు గన్నవరం ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలుకుతున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్

కార్యకర్తల సంక్షేమంపై తీసుకుంటున్న చర్యలను నారా లోకేష్ కు వివరిస్తున్న శిష్ట్లా లోహిత్

*– గన్నవరం ఎయిర్పోర్ట్ లో నారా లోకేష్ కు ఘనస్వాగతం పలికిన శిష్ట్లా లోహిత్*

*– కార్యకర్తల సంక్షేమంపై తీసుకుంటున్న చర్యలపై సమీక్ష*

గన్నవరం : మంగళగిరిలో జరిగే టీడీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాల్లో పాల్గొనేందుకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య కొద్దిసేపు పార్టీ వ్యవహారాలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలపై నారా లోకేష్ సమీక్షించారు. పార్టీ కార్యకర్తల ఆరోగ్యం, ఉపాధికి సంబంధించి ర్యాపిడో, న్యూట్రిఫుల్ యాప్ లపై అవగాహన కల్పిస్తున్నట్టు శిష్ట్లా లోహిత్ చెప్పారు. కార్యకర్తలు ఆరోగ్యంగా ఉంటేనే తెలుగుదేశం పార్టీ పటిష్ఠంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని నారా లోకేష్ వ్యక్తం చేశారు. న్యూట్రిఫుల్ యాప్ ద్వారా డయాబెటిస్, బరువు, థైరాయిడ్ వంటి సమస్యలకు ప్రముఖ వైద్యులచే సలహాలు, సూచనలను అందించడం జరుగుతోందని శిష్ట్లా లోహిత్ వివరించారు. ర్యాపిడో యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. క్యాడర్ వెల్ఫేర్ 2.0 కార్యక్రమం ద్వారా యువతను మరింత ప్రోత్సహిస్తున్నామని నారా లోకేష్ తెలిపారు. కార్యకర్తల సంక్షేమానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న కార్యక్రమాలు పూర్తిస్థాయిలో సద్వినియోగమయ్యేలా చూడాలని శిష్ట్లా లోహిత్ ను నారా లోకేష్ ఆదేశించారు.


SAKSHITHA NEWS