శిల్పా కుటుంబం ప్రజాసేవ కోసం అంకితమై, ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నామని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని 12వ వార్డుకు టిడిపి కి చెందిన చాంద్ భాయ్ అతని అనుచరులు 50మంది సభ్యులతో కలిసి వైఎస్ఆర్సిపి నాయకులు గన్నీ కరీం, జాకీర్,అన్వర్, అన్సర్ల ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో టిడిపిని వీడి వైసీపీలో చేరడం జరిగింది. వీరందరికీ వైఎస్ఆర్సిపి కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని పేరుపేరునా ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ… 12వ వార్డులో టిడిపిలో ముఖ్య కార్యకర్తగా కరుడుగట్టిన నాయకుడిగా పనిచేసిన చాంద్ భాయ్, అతని అనుచరులు నేడు టిడిపిని వీడి వైఎస్ఆర్సిపి లోకి రావడం అభినందనీయం అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి అలాగే నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేపడుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన వీరందరూ సభ్యులతో పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. నేటి నుండి వైసీపీ బలోపేతానికి సైనికుల్లా ఉంటూ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే గా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. నంద్యాలలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల గురించి తెలుసుకోవాలని, ఒక్క సారి ఆలోచించాలని కోరారు. నంద్యాలకు మంచి చేసిన నాయకుడు ఎవరో తెలుసుకోవాలని అన్నారు. వైఎస్ఆర్సిపి పార్టీ విజయానికి కృషి చేయాలని అనేకమందికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటినుండి చేసిన అభివృద్ది, సంక్షేమం అలాగే నంద్యాలలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పనితీరును తెలియజేయాలని కోరారు. అలాగే అందరి చేత ఓట్లను వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. ఎవరికి భయపడవద్దని, దేనికి లొంగవద్దని, నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా పార్టీకి కట్టుబడి పని చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సిపి పార్టీలో చేరిన వారు అబ్దుల్లా, కలందర్, అల్తాఫ్, ఆసిఫ్, ఇస్మాయిల్, సోహెల్ , ఇమ్రాన్, ముస్తఫా, బాబా, ఖాజా, షాకీర్, అహ్మద్ తదితరులు ఉన్నారు.