SAKSHITHA NEWS

సాక్షిత*శంకర్ పల్లి;
2023-24 సంవత్సరానికి గాను జరిగిన పదవ తరగతి పరీక్షల్లో రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు మంచి ప్రతిభను చాటారు. పాఠశాలలో మొత్తం 102 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయగా అందులో 96 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. మండల పరిధిలో అత్యధిక ఫలితాలు సాధించిన మూడో పాఠశాలగా నిలిచి 96% ఉత్తీర్ణత సాధించింది.

మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి తెలంగాణ ఆదర్శ పాఠశాల శంకర్ పల్లికి చెందిన విద్యార్థిని కె. మధుప్రియ 9.7/10 సాధించి మండలంలోని టాపర్గా నిలిచింది. కాగా జి. మౌనిక9.3/10, జి. మహేష్9.3/10, ఎన్. హరిణి9.3/10, టి. సుప్రియ9.3/10, సాయి శ్లోక9.2/10, జి. రుచిత9.2/10, జి. వంశీ9.2/10, ఎస్, పల్లవి9.0/10, హిమబిందు9.0/10, మన్మిత9.0/10, సీమ ముస్కాన్9.0/10 తదితరులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. కాగా 8 జిపిఏ సాధించిన విద్యార్థులు 27, 7 జిపిఏ సాధించిన విద్యార్థులు 39, 6 జిపిఏ సాధించిన విద్యార్థులు 14, 5 జిపిఏ సాధించిన విద్యార్థులు3. మండలంలోని అత్యధిక జీపీఏ సాధించిన విద్యార్థులుగా ఆదర్శ పాఠశాల ఉత్తమ ప్రతిభ కనబరచడంతో మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ జి. మహేశ్వరరావు పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు.

WhatsApp Image 2024 04 30 at 7.34.18 PM

SAKSHITHA NEWS