SAKSHITHA NEWS

సిగ్గు..సిగ్గూ..!
కొత్త పార్లమెంటు భవనమంట ఇదిగో చూడండి..లోపల అంతా డొల్లా*
చిన్నపాటి వానలకే కురుస్తున్న..దేశ అత్యున్నత ప్రజాస్వామ్య సౌధం*

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

రూ. 862 కోట్లతో నిర్మించిన ఈ భవనం 2023 మే లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. సుమారు వందేళ్ళ పాత పార్లమెంటు భవనం బాలేదనే సాకుతో కొత్తగా నిర్మించిన ఈ కార్పొరేట్ బిల్డింగు.. ఏడాది గడిచిందో లేదో.. ఇదిగో ఇలా నీరు కారుతోంది. నింగి నుంచి జల్లు పడుతుంటే.. కోట్లాది రూపాయల ప్రజల సొమ్ముతో నిర్మించిన దేశ అత్యున్నత ప్రజాస్వామ్య సౌధం.. ఇదిగో పై దృశ్యంలో చూయించినట్లు గుడారం మాదిరి కారుతోంది. కింద బకెట్ పెట్టి మరీ.. సర్దుకుంటున్న దుస్థితి నెలకొంది. ప్రచార ఆర్భాటం తప్పితే.. పక్కా ప్రణాళిక పనులు లేవని దీనిని బట్టి స్పష్టంగా తెలుస్తోంది.
ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాo రెడ్డి స్పందిస్తూ..
మోదీ పాలనలో ప్రచార ఆర్భాటాలు తప్పితే.. ఆచరణలో అంతా డొల్ల అని ఢిల్లీ నుంచి ఓ ప్రకటనలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి పేర్కొన్నారు. ఈ బీజేపీ పాలనలో ప్రజలకు దక్కేది శూన్యమని తెలిపారు. కార్పొరేట్ కార్యాలయ హంగులు తప్పితే..పదికాలాల పాటు మన్నికయ్యేలా.. రేపటి తరాలకు ఆదర్శంగా నిలిచేలా నిర్మించాలనే ఉద్దేశమే వారికి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

WhatsApp Image 2024 08 01 at 17.29.37

SAKSHITHA NEWS