SAKSHITHA NEWS

ఖాళీగా ఉన్న ప్రభుత్వభూమిలో పార్క్ ను ఏర్పాటు చెయ్యండి.
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

    గాజులరామారం సర్కిల్ జగత్గిరిగుట్ట డివిజన్లో ప్రజలకు ఉపయోగపడే విదంగా జగత్గిరిగుట్టలోని 348/1లొ ఉన్న ప్రభుత్వ భూమిలో పార్కు ను ఏర్పాటు చెయ్యాలని నేడు ప్రజవాని సందర్బంగా గాజులరామారం సర్కిల్ డిప్యూటీ కమీషనర్  మల్లారెడ్డి  కి వినతిపత్రం సమర్పించారు.
   ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జగత్గిరిగుట్ట డివిజన్లో నేటి వరకు ఒక్క పార్కు కూడా లేదని,కాని అనేక ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ఆ ప్రభుత్వ భూమిలో ఆహ్లాదకరమైన ఒక పార్కును ఏర్పాటు చెయ్యాలని అన్నారు. ముఖ్యంగా  348/1  సర్వే నంబర్లోని  రాజీవగృహకల్ప లో, పోలీస్ స్టేషన్ పక్కన,ఎదురుగా, అదేవిధంగా  హెచ్ ఏం టి  ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఉందని వీటి పైన నిర్ణయాలను తీసుకొని వెంటనే అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని లేకపోతే ఉన్న ప్రభుత్వ భూమి కబ్జాలకు గురవుతుందని అన్నారు.
    ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి,హరినాథ్ రావ్, ప్రజానాట్యమండలి కార్యదర్శి ప్రవీణ్,సిపిఐ మండల నాయకులు శేఖర్,ప్రసాద్ లు పాల్గొన్నారు.

SAKSHITHA NEWS