ఒక గంట సమయం నా కోసం కేటాయించండి .. మీకోసం ఐదేళ్లు కష్టపడతా..ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి గారు..
స్థానిక MR పల్లి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది.
తిరుపతి గురించి దేశమంతా మాట్లాడుకోవాలని ప్రతిక్షణం పరితపిస్తున్నాను..
ఈ ఐదేళ్లలో తిరుపతిలో జరిగిన అభివృద్ధిని గతంలో ఎప్పుడైనా చూశారా, గత పాలకులు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే చేశారు కానీ నగరాభివృద్ధిని గాలికొదిలేశారు. ఆ నాయకులకు రాజకీయాలు తప్పితే ప్రజల బాగోగులు అవసరం లేదు. కానీ స్థానికుడిగా ఇక్కడే పుట్టి పెరిగిన వాడిగా నేను తిరుపతి అభివృద్ధికి కంకణం కట్టుకున్నాను. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలతో పాటు అభివృద్ధిలో తిరుపతి గురించి దేశమంతా మాట్లాడుకోవాలని ప్రతి క్షణం పరితపిస్తున్నాను.
ఇందుకోసమే మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించి ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టాం. త్వరలోనే 4వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి క్రైమ్ ఫ్రీ సిటీగా మారుస్తా. అలాగే మన యువత స్థానికంగానే ఉపాధి పొందేలా ఐటీ కంపెనీలు తీసుకొచ్చే ప్రణాళికలు రూపొందిస్తున్నాను.
ఫోటోగ్రాఫర్స్ కి అండగా ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఏ సమస్య వచ్చిన మీ ముందు నిలబడి మీ సమస్యలని పరిష్కరిస్తానని మాటిస్తున్నాను.
ఇవన్నీ జరగాలంటే రాబోయే ఎన్నికల్లో మీరంతా నాకు ఓటు వేసి అండగా నిలవాలని అభ్యర్థిస్తున్నాను.