SAKSHITHA NEWS

సాక్షిత * : చందానగర్ డివిజన్ పరిధిలోని సురక్ష ఎనక్లేవ్ కాలనీ కి చెందిన బీజేపీ పార్టీ కి చెందిన సీనియర్ నాయకులు పోచయ్య బీఆర్ఎస్ పార్టీ చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వివేకానంద నగర్ లోని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నివాసంలో వారికి బీఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి బీఆర్ ఎస్ పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ మాట్లాడుతూ పోచయ్య బీజేపీ పార్టీ నుండి తిరిగి సొంత గూటికి రావడం చాలా సంతోషకరమైన విషయం అని, ప్రజల చూపు అంతా బీఆర్ఎస్ వైపే ఉంది అని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరుగుతుంది అని, ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఆశీర్వాదిస్తున్నారని ఆయన తెలిపారు.

సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు సైతం తమ వెంట రావడం పార్టీకి శుభసూచకం అన్నారు.ఈ రోజు పోచయ్య బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, మరియు వారి ఆశీర్వాదం తో, వారి సూచనలు,సలహాలతో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ తెలియచేశారు.. ప్రతి ఒక్కరు బీఆర్ ఎస్ పార్టీ పటిష్టతకు సైనికుడిగా పనిచేయాలని, బీఆర్ ఎస్ పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు,

అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని, ప్రతి ఒక్కరం కష్టపడి బంగారు తెలంగాణలో భాగస్వాములం అవుదామని గాంధీ పేర్కొన్నారు. అదేవిదంగా ముఖ్య మంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ నిర్మాణము కోసం ఎంతో కృషి చేస్తున్నారని ,మైనార్టీ ల సంక్షేమానికి కృషి చేస్తున్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అనేక సంక్షేమ పథకాల తో అలరిస్తున్నారు అని, అందులోభాగంగా కల్యాణ లక్ష్మి /షాదీ ముబారక్ షాదీ ముబారక్ ద్వారా పేదింటి ఆడపిల్లకు 1 ,00 ,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని , ఆసరా పింఛన్లు ,ఒంటరిమహిళా పింఛన్లు,కెసిఆర్ కిట్,కంటి వెలుగు ,రైతు బంధు ,రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు,మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు వంటి అనేక గొప్పసంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ గారిదేనని ప్రభుత్వ విప్ గాంధీ తెలియజేసారు.

ప్రతి ఒక్కరు సైనికుడిగా పనిచేయాలని, తెరాస పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు, అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని, ప్రతి ఒక్కరం కష్టపడి బంగారు తెలంగాణలో భాగస్వాములం అవుదామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి , వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు ప్రసాద్, శ్రీకాంత్ రెడ్డి, పారునంది శ్రీకాంత్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS