SAKSHITHA NEWS

మారని జగన్ సైకో నైజంతో – ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న సీనియర్ నాయకులు.. ఈ క్రమంలో
54 ఏళ్ల వయసుకే రాజకీయ వృత్తిని వదులుకొన్న ఆళ్ల నాని

20 ఏళ్ల్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే నుండి డెప్యూటీ సిఎం వరకు ఎదిగాడు ఆళ్ల నాని. ఏ పార్టీకైనా గెలుపు ఓటములు సహజం. కానీ దేశంలోనే ఘోరాతి ఘోరంగా వైకాపాను జనం సమాధి చేశారు. పార్టీకి కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేదు.

పార్టీ ఏ స్థాయిలో వుందో దానికి తగ్గట్లుగా కాకుండా.. మళ్లీ తన పాలనలో జరిగిన దౌర్జన్యాలు, హత్యల లెక్కనే ప్రస్తుతం వుందని, నెలకే ఆగలేక రాష్ట్రపతి పాలన పెట్టమంటూ.. ఆ పథకం అమలు చెయ్యలేదు ఈ పథకంలో మోసం దగా అంటూ.. వైకాపాను బతకకుండా జగనే తన చేజేతులా ఇంకా నాశనం చేస్తున్నాడనే అభిప్రాయం నాయకుల్లో వ్యక్తం అవుతోంది . రెండు నెలలకే జగన్ చేస్తున్న వికృత ప్రచారం ఓవర్ యాక్షన్ పై వైసిపి శ్రేణులు సైతం విస్తు పోతున్నారు. సొంత పార్టీ వారికి సైతం మింగుడుపడడం లేదు. ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకి ఎక్కడం, తాను అధికారంలో ఉండగా నిండు అసెంబ్లీలో పది మంది ఎంఎల్ఏ లకు డోర్ తీస్తే టిడిపి కి ప్రతిపక్ష స్థానం ఉండదని చెప్పి.. ఇపుడు అదే నీతిని వదలి అడ్డదారులు తొక్కడం.. కూటమి వచ్చి నెల రోజులు కాకనే రాష్ట్రపతి పాలన డిమాండ్ చేయడం జగన్ మానసిక పరిస్థితిపై సొంత పార్టీ లోనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి

ఇలాంటి దుర్మార్గ పార్టీ వైకాపా ఇలాంటి సైకో జగన్ అని ప్రజలు ఇంకా ఛీకొట్టేలా జగన్, సాక్షి కలిసి చేస్తుంటే.. మింగుడుపడని పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పార్టీ మారతున్నారు. రాజకీయాల నుండే తప్పుకొంటున్నా అంటూ 54 ఏళ్లకే ఆ వృత్తి నుండి తప్పుకొంటున్నా అని ఆళ్ల నాని రాజీనామా చెయ్యడం పెద్ద ఆశ్చర్యానికి గురిచెయ్యడం లేదు.

ఆ పార్టీ పేరు తనను నీడలా వెంటాడి వ్యక్తిత్వ హననం చేస్తుంది అని భావించి, రాజకీయల నుండి తప్పుకొంటే.. జనంలో కాస్తా పరువు, మర్యాదలు అయినా మిగులుతాయి అని ఆలోచిస్తే తప్ప, 20 ఏళ్ల రాజకీవితం నుండి 54 ఏళ్ల వయసులో ఇలాంటి తప్పుకొనే నిర్ణయం తీసుకోరు.

ఇంత సున్నితంగా ఆలోచించి, నిజమైన సౌమ్యుడిగా.. సమాధి కానున్న వైకాపా నుండి గౌరవంగా తప్పుకొంటున్న నానీకి అభినందనలు అంటున్న రాజకీయ విశ్లేషకులు

రానున్న రోజుల్లో వైసిపి నుంచి ఇంకా పార్టీని వీడేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. చివరకు వైసిపి కనుమరుగు అయ్యే సూచనలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా


SAKSHITHA NEWS