Semi-Christmas celebrations in Patancheru on 22nd of this month
ఈ నెల 22న పటాన్చెరులో సెమీ క్రిస్మస్ వేడుకలు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
సాక్షిత పటాన్చెరు: క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఈనెల 22వ తేదీన పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గస్థాయి సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్యక్షతన నియోజకవర్గస్థాయి చర్చి పాస్టర్లతో సెమీ క్రిస్మస్ వేడుకల సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని తెలిపారు. అన్ని మతాల ప్రధాన పండుగలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తాను ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన నాటి నుండి సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈనెల 22వ తేదీన పటాన్చెరులో నిర్వహించబోయే సెమీ క్రిస్మస్ వేడుకలకు నియోజకవర్గ పరిధిలోని క్రిస్టియన్లు అందరూ భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
నియోజకవర్గంలో క్రైస్తవుల కోసం కమ్యూనిటీ భవనం, స్మశాన వాటికలు నిర్మించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు.
క్రిస్మస్ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఏటా అందించే క్రిస్మస్ కానుకలను నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని చర్చిలకు పంపిణీ చేయడం జరిగిందని, నిరుపేద క్రిస్టియన్ కుటుంబాలకు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకటేష్ గౌడ్, అఫ్జల్, విజయ భాస్కర్ రెడ్డి, రాజేష్, షేక్ హుస్సేన్, ఈర్ల రాజు, నియోజకవర్గ పాస్టర్ల సంఘం అధ్యక్షులు ప్రశాంత్, భారీ సంఖ్యలో పాస్టర్లు పాల్గొన్నారు.