SAKSHITHA NEWS

ప్రాంగణ నియామకాలలో యస్.బి.ఐ.టి. విద్యార్ధుల ఎంపిక

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

హైదరాబాద్కు చెందిన ప్రముఖ సంస్థ 10,000 కోడర్కు తమ కళాశాల నుండి 16 మంది విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ఛైర్మన్ జి. కృష్ణ తెలిపారు. కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ప్లేస్మెంట్స్ కు ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణ, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉద్యోగం సాధించాలంటే ముందుగా పట్టుదల కలిగి ఉండాలని పట్టుదల లేనిదే గమ్యం చేరలేమని వారు తెలిపారు. సాధించిన ఉద్యోగాన్ని నిలబెట్టుకొనేలా కృషి చేయాలని వారు విద్యార్థులకు సూచించారు.

ప్రముఖ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సంస్థ 10,000 కోడర్స్ ఎంపికైన విద్యార్థులకు వారి వారి అర్హతను కమ్యూనికేషన్ స్కిల్స్ను బట్టి సంస్థను ఎంపిక చేస్తారని, 10,000 కోడరు 50 కు పైగా సంస్థలతో అవగాహనా ఒప్పందం కలిగి ఉందని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా॥ జి. ధాత్రి తెలిపారు. ఎంపిక కాబడిన విద్యార్థులకు వారి వారి సంస్థను అనుసరించి 3 నుంచి 5 లక్షల వార్షిక ఆదాయం అందుతుందని వారు తెలిపారు. వీరితో పాటు మరి కొంత మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు, వారికి కొంత కాలం ఉచితంగా శిక్షణను అందించి ఉద్యోగ నియామకాలు చేపడతారని వారు తెలిపారు.

కోడింగ్, గ్రూప్ డిస్కషన్ మరియు ఆప్టిట్యూడ్ పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేసినట్లు, విద్యార్థులలోని లోటు పాట్లను తెలుపుతూ అసెస్మెంట్ రిపోర్ట్ అందించినట్లు తద్వారా విద్యార్థులు తమ అర్హతలను తెలుసుకోగలరని కళాశాల ప్రిన్సిపల్ డా॥ జి. రాజ్ కుమార్ తెలిపారు. ఎంపిక కాబడిన విద్యార్థులను వారు అభినందించి శుభాకాంక్షలను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో 10,000 కోడర్స్ కోఫౌండర్ రాకేష్, జనరల్ మేనేజర్ బి. సురేష్, హెచ్.ఆర్. అండ్ కమ్యూనికేషన్ ట్రైనర్ సాయి సాహితీ మరియు కళాశాల అకడమిక్ డైరెక్టర్స్, గంధం శ్రీనివాసరావు, డా॥ ఎ.వి.వి. శివ ప్రసాద్, గుండాల ప్రవీణ్ కుమార్, డా|| జె. రవీంద్రబాబు, డా॥ యన్. శ్రీనివాసరావు, టి.పి.ఒ. యన్. సవిత, కోఆర్డినేటర్ జి. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS