స్థానికులకే సగం డబుల్ ఇండ్లని కేటాయించాలి కుత్బుల్లాపూర్ నియోజిక వర్గంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న 15 వేల డబుల్ బెడ్రూం ఇండ్లని 50% కుత్బుల్లాపూర్ ప్రజలకి కేటాయించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర మంత్రి కే టి ఆర్ పర్యటన నేపత్యంలో నిరసన తెలియజేస్తూ గండి మైసమ్మ వద్ద డా ఎస్ మల్లారెడ్డి నాయకత్వంలో రాస్తా రోకో నిర్వహించిన కుత్బుల్లాపూర్ బీజేపీ నాయకులు.. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా విడుదల చేసిన నిధులతో డబుల్ బెడ్రూం లు కట్టి తామే కట్టినట్టుగా ప్రచారం చేసుకుంటోంది అన్నారు… ఇతర ప్రాంతాల వారికి కుత్బుల్లాపూర్ లో ఇండ్లను కేటాయిస్తూ అసలైన లబ్దిదారులును వారి కోసం పోరాటం చేస్తున్న బీజేపీ నాయకులను పోలీసుల చేత నిర్బంధం చేసి ఇండ్ల పంపిణీ చేస్తున్న ఈ ప్రభుత్వం చర్య ను బీజేపీ కుత్బుల్లాపూర్ ఖండిస్తుంది.. అలాగే 2011 లో ఇక్కడ దుందిగల్ మున్సిపాలిటీ లో పేదలు 600 మందికి అప్పటి ప్రభుత్వం సర్వే నం 453/454 లో ఇచ్చిన 60 గజాల స్థలాలను ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి వాడుకొని ఆ 600 మందికి ఇటు స్థలాలు కానీ అటు డబుల్ ఇండ్లని కానీ ఇవ్వకుండా మోసం చేసింది అని కట్టిన ఇండ్లలో 600 మందికి ఇండ్లను పంపిణీ చేయాలి అని, 60 గజాల స్థలాలను వెంటనే కేటాయించాలి అని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో శ్యామ్ రావు, విగ్నేశ్వర్, గోనె మల్లారెడ్డి, రామచంద్ర రెడ్డి, ఆకుల మల్లేష్, శ్రీశైలం యాదవ్, శ్రీనివాస్ యాదవ్, ఆకుల విజయ్, వెంకటేష్ నాయక, జంగారెడ్డి,ఆకుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు
15 వేల డబుల్ బెడ్రూం ఇండ్లని 50% కుత్బుల్లాపూర్ ప్రజలకి కేటాయించాలని కోరుతూ
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…