సాక్షిత : సికింద్రాబాద్ ను చెత్త రహిత ప్రాంతంగా, పరిశుభ్రత కలిగిన ప్రదేశంగా తీర్చి దిద్దుతున్నామని , అధికార యంత్రాంగం చొరవ తీసుకొని ప్రజల్లో చైతన్యం కలిగించాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. జీ హెచ్ ఎం సీ సికింద్రాబాద్ సర్కిల్ కి రాంకీ ద్వారా సమకూరిన కొత్త చెత్త తరలింపు డబ్బాలను ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ లాంచనంగా ఆవిష్కరించి, పారిశుధ్య సిబ్బందికి అందించారు. సితాఫలమండీ లోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మారావు గౌడ్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు నిరంతరం సేవలను అందిస్తున్నారని ప్రశంసించారు. వైద్యాధికారి డాక్టర్ రవీందర్ తో పాటు అధికారులు, నేతలు పాల్గొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలోని దాదాపు 17 4 బృందాలకు ఈ కొత్త డబ్బాలను అందించాలని, స్థానిక కార్పొరేటర్ లను సమన్వయము చేసుకోవాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
సికింద్రాబాద్ ను చెత్త రహిత ప్రాంతం
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…