SAKSHITHA NEWS

Secretariat staff should be ready in response – Commissioner Anupama Anjali

సచివాలయ సిబ్బంది స్పందనలో సిద్దంగా వుండాలి – కమిషనర్ అనుపమ అంజలి


సాక్షితతిరుపతి: ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో ప్రజలకు అందుబాటులో వుండేందుకు సచివాలయ సిబ్బంది తమ తమ సచివాలయాల్లో సిద్దంగా వుండాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు.

తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమంలో కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణలు ప్రజల నుంచి వచ్చిన పిర్యాదులను స్వీకరించి సంబంధిత అధిజారులకు తగు ఆదేశాలు జారీ చేస్తూ, ప్రజల నుండి వచ్చిన పిర్యాదులపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.

సచివాలయ సిబ్బందితో టెలీ కాన్పరెన్స్ ద్వారా కమిషనర్ అనుపమ మాట్లాడుతూ ప్రతి సోమవారం తమ తమ సచివాలయల్లో అందరు సిబ్బంది ఉదయం 10 నుండి 12 గంటల వరకు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని, అదేవిధంగా నగరపాలక సంస్థకు వచ్చే ఫిర్యాదులను సచివాలయ సిబ్బందికి అప్పటికప్పుడే తెలియజేయడం జరుగుతుందని, సచివాలయ సిబ్బంది ఖచ్చితంగా యూనిఫామ్ ధరించి ఉండాలని ఆమె సూచించడం జరిగింది.

నరసింహ తీర్థం రోడ్ తుడా అపార్ట్‌మెంట్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా వున్న ఓపెన్ డ్రైన్ వాటం సరిగా లేనందున మురికి నీరు రోడ్డుపైకి వచ్చి నిలుస్తున్నదని, దీని వలన దుర్గందం వస్తూ దోమలు పెరుగుతున్నాయనే పిర్యాదుపై స్పందిస్తూ తమ సిబ్బంది పరిశీలించి తగు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.

అన్నమయ్య మార్గ్ వెనుక వైపు రోడ్లు, కాలువలు ఏర్పాటు చేయాలని, హతీరాంజీ కాలనీ రాధానారాయణ హాస్పిటల్ ప్రక్కన కుక్కలు ఎక్కువగా వుండడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చంద్రశేఖర్ రెడ్డి కాలనీ వద్ద కాలువపై ఉన్న బ్రిడ్జి కృంగిపోతున్నదని వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని, లీలామహల్ విశ్వసాయి స్కూల్ వద్ద పెద్ద కాలువ నిర్మించారని, నిర్మించేటప్పుడు ఏర్పడిన గుంతలను అలాగే వదిలివేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, జగన్నాధపురం, సున్నపు వీధి, రైల్వే కాలనీల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణలు చేపడుతున్నారని, వివేకానంద్ నగర్, రైల్వే కాలనీలో వీధి పేర్లు తెలుపుతూ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, తమకు కేటాయించిన ఇంటిని వేరే వారు ఆక్రమించారనే పిర్యాదులు రావడంతో, పిర్యాది దారులకు హామి ఇస్తూ వారు సూచించిన పిర్యాదులపై తక్షణమే తమ అధికారులు పరిశీలించి తగు చర్యలు చేపడుతారని కమిషనర్ అనుపమ అంజలి చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సునీత, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, ఎంఈ వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, కె.ఎల్.వర్మ, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, అసిస్టెంటు సిటీ ప్లానర్లు బాలసుబ్రహ్మణ్యం, షణ్ముగం, మేనేజర్ చిట్టిబాబు, డిఈలు విజయకుమార్ రెడ్డి, రవీంద్ర రెడ్డి, సంజీవ్ కుమార్, మహేష్, గోమతి, దేవిక, శానిటరి సూపర్ వైజర్ చెంచెయ్య, సుమతి తదితర అధికారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS