పల్నాడు జిల్లా:
pension బతుకు భారమైన వారికి అండగా నిలుస్తూ ప్రభుత్వం ఆసరా పెన్షన్లు అందిస్తుం టే.. అలాంటి పెన్షన్లనూ మింగేసి కడుపుకొట్టాలని చూశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన పల్నాడు జిల్లా మాచర్లలో చోటుచేసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీలో భాగంగా.. పెంచిన పింఛన్లు అంది స్తుండగా..మాచర్ల 9వ వార్డుకు చెందిన సచివా లయ ఉద్యోగి అందులో 5 వందలు మింగేశాడు.
7వేల రూపాయల పెన్షన్ ఇవ్వాల్సిన దగ్గర 6 వేల 5 వందల ఇస్తూ మోసం చేశాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
చేతివాటం ప్రదర్శించిన బాలునాయక్‌పై శాఖాప రమైన చర్యలు తీసుకోవా లని మాచర్ల కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. మాచర్ల మున్సిపల్ కమిషనర్ సీరియస్‌గా స్పందించారు..
డబ్బులు వసూలు చేసిన ఉద్యోగిపై చర్యలు తీసుకు న్నారు. పింఛన్‌లు పంపిణీ చేసి కమీషన్ తీసుకున్నం దుకు వాలు నాయక్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు.
ఎవరైనా పింఛన్ లబ్ధిదా రుల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఊరుకునేది లేదని.. కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు…