124 డివిజన్ పరిధిలోని ఇంద్రాహిల్స్ కాలనీలో స్నేహ మోడల్ స్కూల్ లో నిర్వహించిన సైన్స్ ఎక్సిబిషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ హాజరై విద్యార్థులు తయారుచేసిన పరికరాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్లు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక, పరిశోధనల పట్ల చిన్ననాటి నుంచే ఆసక్తి పెరుగుతుందని అన్నారు.
చిన్న చిన్న పిల్లలు ఇంత సృజనాత్మకంగా ఆలోచించి ఇన్ని పరికరాలు తయారుచేయడం అభినందించదగ్గ విషయం అని అన్నారు. వారికి సహకరించిన ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియచేసారు. కార్యక్రమంలో సౌజన్య రామకృష్ణ, స్నేహ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మమతరాజ్, కరస్పాండెంట్ ఎం.రాజు, సత్యరాజు అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.