SAKSHITHA NEWS

scheme should address the problems of workers

image 4
స్కీమ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలి__ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్యా , ఆశ వర్కర్స్ యూనియన్ మాజీ రాష్ట్ర అధ్యక్షురాలు సుజాత డిమాండ్

ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్రింది స్థాయిలో తీసుకెళ్లి ప్రజలకు వివరించి ప్రభుత్వానికి మేలు చేస్తున్న స్కీం కార్మికులు ఆశ అంగన్వాడి మధ్యాహ్నం భోజనం స్కూల్ పేపర్స్ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ది.

లక్షలాది మంది మహిళా కార్మికులు అనేక సంవత్సరాలుగా స్కీం కార్మికుల పనిచేయుచున్న వారికి సరైన గుర్తింపు లేక కనీస వేతనాలు ఇవ్వకుండా ఉద్యోగ భద్రత కల్పించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోసం చేస్తున్నాయి.

ఇప్పటికైనా వేతనాల పెంచే విధంగా 15వ తారీకు నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో మహిళా కార్మికుల సమస్యలపై చర్చించి వేతనాలు పెంచాలని కార్మికులకు రిటైర్మెంట్ వయసు పరిమితిని 62 సంవత్సరాలకు పెంచి రిటైర్మెంట్ బెనిఫిట్ కింద పదిలక్షల రూపాయలు ఇవ్వాలని, వారు తీసుకునే జీతంలో సగం శాతం పెన్షన్ గా ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్చార్జీలు పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం అమ్మలు పరుస్తున్న సంక్షేమ పథకాలు స్క్రీ0 కార్మికులకు అందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు,

లేనిపక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున మహిళా కార్మికులు దగ్గర్నుంచి ప్రభుత్వాలు ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికీ ఏ ఐ టి యు సి పూర్తిగా నాయకత్వం వహించి కార్మిక సమస్యలు పరిష్కరించడంలో ముందుంటుందని అన్నారు

ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ మాజీ అధ్యక్షురాలు సుజాత, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సలీనా, మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి పరిమళ ఏఐటీయూసీ సహాయ కార్యదర్శి ఏసుపాదం స్కీం వర్కర్స్ నాయకులు గౌరీ విమల భువనేశ్వరి sheeba ముని లక్ష్మి నాగమ్మ లక్ష్మి లతా ఈశ్వరి మహిళా కార్మికులు పాల్గొన్నారు

SAKSHITHA NEWS