SAKSHITHA NEWS

gachibowli గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాంగుడా SC బస్తీ వాసులు గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాంగుడా SC బస్తీ వాసులు పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగినది.దీనిపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించడం జరిగినది.

gachibowli గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాంగుడా SC బస్తీ వాసులు ఈ సందర్భంగా నానక్ రాంగూడ SC బస్తీ వాసులు మాట్లాడుతూ కాలనీ లో అంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్డు ను వేయాలని, మంచి నీటి వ్యవస్థ ను మెరుగుపర్చలని ఎమ్మెల్యే గాంధీ ని వినతి పత్రం ద్వారా కోరడం జరిగినది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ నానక్ రాంగుడా కాలనీ లో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని. నానక్ రాం గూడ కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతులు కలిపించామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, ప్రజలకు ఇబ్బంది లేకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని అన్ని రోడ్ల ను దశల వారిగా చెప్పటి పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల పనులు వెంటనే చేపట్టి ప్రజలకు ఉపశమనం కలిగేలా చూడలని అధికారులకు తెలియచేసారు.

మంచి నీటి సరఫరా లో అంతరాయం లేకుండా మెరుగైన మంచినీటి సరఫరా చేయాలని, అవసరమున్న చోట మంచి నీటి సరఫరా సమయం పెంచాలని , తక్కువ ప్రెజర్ తో వచ్చే చోట తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గాంధీ జలమండలి అధికారులకు తెలియచేసారు.ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎమ్మెల్యే గాంధీ అధికారులకు తెలియచేసారు . అదేవిధంగా ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని ,ఎల్లవేళలో మీకు అందుబాటులో ఉంటానని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో నానక్ రాం గూడ SC బస్తి వాసులు నరేష్, మహేందర్, యాదయ్య, చంద్రశేఖర్,టి. రవి, కమలేష్, డి. రవి ,రాజు మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

gachibowli

SAKSHITHA NEWS