భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే అని శంకర్‌పల్లి పట్టణంలోని లిటిల్ స్టార్స్ హై స్కూల్ కరెస్పడెంట్ సంజీత్ కుమార్ అన్నారు. సావిత్రి భాయి పూలే జయంతి సందర్భంగా పాఠశాలలో వేడుకలు ఘనంగా జరిగాయి. కరస్పాండెంట్ మాట్లాడుతూ అంతులేని వివక్షలను ఎదుర్కొంటూ ఆడపిల్లల చదువుల కోసం పోరాడిన మహానుభావురాలు సావిత్రిబాయి పూలే. మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం సావిత్రిబాయి పూలే. సమాజంలో ఎదురవుతున్న అవమానాలను సైతం లెక్కచేయకుండా మహిళలతో పాటు బడుగు బలహీనవర్గాల కోసం పోరాటం చేశారు.
మహిళా సేవామండల్ ను స్థాపించి మహిళలను చైతన్య పరిచారు. వితంతువులకు వివాహాలు చేసేవారు. వారి కాళ్లమీద వారు నిలబడేలా చేసేవారు.ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన స్త్రీలు చదువుకొనేందుకు ఆమె స్కూల్ ప్రారంభించారు. ఆమె విప్లవ ప్రసంగాలు ఆనాటి మహిళల్లో ఎందరికో స్ఫూర్తిని కలిగించాయని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ స్వర్ణలత, ఉపాద్యాయులు, విధ్యార్థులు పాల్గొన్నారు.