SAKSHITHA NEWS

మన్భూమ్,బాలకృష్ణ నుండి పరికి చెరువును కాపాడండీ.
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

 కుత్బుల్లాపూర్ మండల జగత్గిరిగుట్ట, గాజులరామారం డివిజన్లలో విస్తరించి ఉన్న పరికిచెరువు ను కాపాడాలని సిపిఐ నాయకులు హైడ్రా కమీషనర్ రంగనాథ్  కార్యాలయంలో   వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ లెక్కల ప్రకారం పరికి చెరువు 45 ఎకరాలుగా ఉందని కాని నేడు కనీసం 15 ఎకరాలు కూడా లేదని ఇప్పటికైనా హైడ్రా స్పందించి పరికి చెరువును పుడ్చి నిర్మాణాలు చేస్తున్న మన్భూమ్ కన్ స్ట్రక్షన్స్ నిర్మాణాలను ఆపివెయ్యాలని,అదే విధంగా రాజీవగృహ కల్ప,భూదేవి హిల్స్ పేరుతో చెరువును పూడ్చివేసి లక్షలకు అమ్ముకుంటున్న బాలకృష్ణ వల్ల కూడా చెరువు కబ్జాకు గురైందని ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకొంటే కనీసం 15 ఎకరాల విస్తీర్ణంను కాపాడుకోగల్గుతామని లేకపోతే కొద్ది నెలలో అక్కడ చెరువు ఆనవాళ్లు కూడా కనిపించకుండా మొత్తం అన్యక్రాంతం అవుతుందని అన్నారు. పరికి చెరువు లేకపోతే భవిష్యత్తులో స్థానిక ప్రజలు నీటితో ఇబ్బంది పడాల్సివస్తుందని కావున హైడ్రా కమీషనర్ స్పందించి వెంటనే పరికి చెరువును సర్వే చెయ్యించి హద్దులు గుర్తించి శాశ్వాత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు హరినాథ్ రావ్, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు ప్రవీణ్,సిపిఐ నాయకులు మహేందర్,ప్రభాకర్,సోమన్న లు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS