SAKSHITHA NEWS


Sarvajna celebrates Maths Day

సర్వజ్ఞలో ఘనంగా గణిత దినోత్సవం

భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ :

ఖమ్మం, వి.డి.వోస్ కాలనీలోని స్థానిక సర్వజ్ఞ పాఠశాలలో గురువారం రోజున ఘనంగా శ్రీనివాసరామానుజన్ జయంతి వేడుకలు నిర్వహించారు.


ఈ వేడుకలలో భాగంగా పాఠశాల డైరెక్టర్స్ రిబ్బన్ కట్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదుపరి శ్రీనివాసరామానుజన్ చిత్రపటానికి పూలమాలను వేసి ఆయనకు నివాళులు అర్పించారు. దీనిలో భాగంగా విద్యార్థులకు మాథ్స్ టాలెంట్ టెస్ట్, మాథ్స్ ఎక్స్ప, క్విజ్, గణిత శాస్త్రానికి సంబంధించిన నమూనాలను ప్రదర్శించారు, వీటికి సంభందించిన పోటీలను నిర్వహించి, విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.


డైరెక్టర్ నీలిమా మాట్లాడుతూ గణిత శాస్త్రం సకల శాస్త్రాలన్నింటికి తలమానికమని, చదువులకు, పరీక్షలకే కాకుండా నిత్య జీవితంలో గణితం యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉందని రామానుజన్ 135వ
జయంతి వేడుకలను పురస్కరించుకొని 1729 సంఖ్య ప్రాధాన్యతను మరియు ఆయనకు గణితంలో గల సామర్థ్యాలను గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది.

అంతేకాకుండా గణితం ఎందుకు అంత ప్రాముఖ్యమైంది అంటే రోజు వారి జీవితంలో మొదలయ్యే ప్రతి పనిలో, టైమ్ మేనేజ్మెంట్, ఆర్థిక విషయాలలో, మెదడుకు వ్యాయామం కలిగించడంలో, సమస్యా పరిష్కార నైపుణ్యంలో
ఇలా ప్రతి విషయాలలో గణితం చాలా ప్రాముఖ్యమైనది అని వివరించారు. డైరెక్టర్ ఆర్.వి. నాగేంద్రకుమార్ మాట్లాడుతూ శ్రీనివాసరామనుజన్లో అసాధరణంగా దాగిఉన్న అంతర్దృష్టి అతణ్ణి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తగా నిలబెట్టింది. ఏ గణిత సూత్రాన్ని నిరూపణలు లేకుండా ఆయన ఆవిష్కరించలేదు.

గణిత సూత్రాలు, ప్రవచనాలు, సిద్ధాంతాలు, నంబర్ థీరమ్స్, మొదలైన గణిత సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం శ్రీనివాస రామానుజన్ పేర తపాల బిళ్ళను విడుదల చేసిందని తెలిపారు. ఆయన జన్మించిన డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవముగా నిర్ణయించింది. మన నిత్య జీవితంలో గణితం యొక్క ప్రాముఖ్యత అనంతమైనది. గణితం మన జీవితంలో ఒక భాగంమైంది.

గణితం గురించి తెలియకుండానే ప్రతి చోట గణితం యొక్క ఉపయోగం ఉంటుందని, ప్రతి వస్తువును -మనం లెక్కించకుండా ఉపయోగించడం అనేది జరగదు. ప్రపంచం గణితం చుట్టూనే తిరుగుతుంది. గణితం లేకుండా మన జీవితాలను ఊహించుకోవడం అనేది “ఓడ ఉన్న ప్రయాణం లేని నావ లాంటిది” అని విద్యార్థులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ ఆర్. వి. నాగేంద్రకుమార్, నీలిమా పాల్గొని విద్యార్థులు గణితశాస్త్రం పట్ల అభిరుచిని పెంపొందించుకొని వివిధ రకాల జ్ఞాన పరీక్షలలో పాల్గొని వారి యొక్క ప్రతిభా పాటవాలను పెంపొందించుకోవాలని వారు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమాలలో పాఠశాల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర బృందం పాల్గొన్నారు.


SAKSHITHA NEWS