SAKSHITHA NEWS

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ జనగాం రవీందర్ గౌడ్ కోరారు. చిట్యాల మండలం తాళ్లవెల్లంల గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ జనగాం రవీందర్ గౌడ్, ఎంపిటిసి వడ్డేపల్లి లక్ష్మయ్య, మండల వైద్యాధికారి డా. గట్టు కిరణ్ కుమార్, కంటి వెలుగు శిబిరం ఇంచార్జ్ డా.ప్రియాంక లతో కలిసి ప్రారంభించారు.


ఈ సందర్భంగా సర్పంచ్ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలోని పేదప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలోని పేదప్రజల కంటి పరీక్షల కోసం కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని అమలుచేసి కంటి పరీక్షలను పూర్తిగా ఉచితంగా చేయిస్తున్నారని పేదప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అనునిత్యం పరితపించే ముఖ్యమంత్రి ఉండడం తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టమని తెలిపారు.


మండల వైద్యాధికారి గట్టు కిరణ్ కుమార్ కంటి సమస్యలు ఉన్నవారు, 18సం.లు పైబడిన వారు తప్పక పరీక్షలు
పేద ప్రజలు అందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కంటి వైద్య నిపుణురాలు డా.ప్రియాంక మాట్లాడుతూ ప్రజలు ఎవరూ కంటి సమస్యలతో బాధపడవద్దనే లక్ష్యంతో ప్రభుత్వం కంటి పరీక్షలను నిర్వహించి అద్దాలతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని, అవసరమైన వారికి కంటి ఆపరేషన్లను సైతం చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అంజయ్య, పంచాయతీ కార్యదర్శి మాధవరెడ్డి,
ఎఎన్ఎం శైలజ, ఆశా వర్కర్లు లక్ష్మీ, రేణుక తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS