Sankranti Parvadinam is the most important festival for Telugu people
సాక్షిత : తెలుగువారి కి అత్యంత ప్రాముఖ్యత గల పండుగ సంక్రాంతి పర్వదినం అని.. కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అంతా ఒక చోట కలిసి వేడుకలు జరుపుకునే పెద్ద పండుగని… అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని… కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు (డిఎన్ఆర్) అన్నారు.
సంక్రాంతి సంబరాలులో భాగంగా ఈ ఉదయం కైకలూరులోని శ్రీ చైతన్య స్కూల్లో జరిగిన వేడుకలకు డిఎన్ఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత నిర్వాహకులు ఎమ్మెల్యే డిఎన్ఆర్ ను ఘనంగా స్వాగతించారు. అనంతరం ఎమ్మెల్యే డిఎన్ఆర్ ఎడ్ల బండి పై స్వారీ చేస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగుతనం ఉట్టిపడేలా సాంప్రదాయ వస్త్రధారణలతో ఈ ప్రాంగణమంతా చాలా కనులవిందుగా ఉందని…విద్యార్థిని విద్యార్థులు అలంకరించిన బుట్ట బొమ్మల లాగా ఉన్నారని అన్నారు. చక్కని బొమ్మల కొలువు తీర్చిదిద్దినట్లు ఉన్న చిన్నారులందరికీ ఆశీస్సులు అందిస్తున్నానని అన్నారు.
ఈ సంక్రాంతి మనందరికీ నవ్య క్రాంతిని తేవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే డిఎన్ఆర్ అన్నారు. ముందుగా వేడుకల్లో ఏర్పాటు చేసిన భోగిమంటలు, గంగిరెద్దుల మేళం, సంక్రాంతి ముగ్గులు, బొమ్మల కొలువులు చూపరులకు ఆసక్తిని కలిపే విధంగా ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ అడవి వెంకట కృష్ణ మోహన్,మండవల్లి ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామ దుర్గాప్రసాద్, వైస్ ఎంపీపీ మహమ్మద్ జహీర్,మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చెరుకువాడ బలరామరాజు, మండల వైకాపా అధ్యక్షులు బట్రాజు శివాజీ, పెద్దలు చెరుకువాడ శివరామరాజు, చింతపల్లి వెంకటనారాయణ, నాయకులు కన్నా బాబు, రామిశెట్టి బుజ్జి,మాదాసు రాము, టౌన్ సిఐ నాగరాజు, ప్రిన్సిపాల్ సురేంద్ర, రవి విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు