సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సాయి నగర్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ హారితోత్సవం(మాస్ ప్లాంటేషన్) కార్యక్రమంలో * మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి * ముఖ్య అతిథిగా కమీషనర్ రామకృష్ణ రావు , కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జెడ్పిహెచ్ఎస్ స్కూల్,విజ్ఞాన్ జ్యోతి స్కూల్, వియన్ఆర్ కాలేజ్ విద్యార్థులతో కలిసి దాదాపు 500 మొక్కలు నాటారు.
అదే విధంగా మాస్ ప్లాంటేషన్ లో భాగంగా కార్పొరేషన్ పరిధిలో 4,800 పలు మొక్కలను నాటడం జరిగింది.పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం పై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.అనంతరం మేయర్ చేతుల మీదుగా విద్యార్థులకు స్కూల్ యూనిఫార్మ్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు,అధికారులు,సీనియర్ నాయకులు,యువ నాయకులు,మహిళా నాయకులు,NMC హరిత హరం విభాగం,ఇతర విభాగాల అధికారులు మరియు సిబ్బంది ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.