Sabitha Indra Reddy, Minister of Kanti Velak as a festival of eyes
కన్నుల పండుగగా కంటి వెలుగు మంత్రి సబితా ఇంద్రారెడ్డి
సాక్షిత : మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పెట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంబేద్కర్ నగర్లో రెండవ విడత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన *తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి .పి.సబితా ఇంద్రారెడ్డి
మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ
మీ ఊరు, మీ వార్డులోనే కంటి పరీక్ష శిబిరాలు. 100 రోజులపాటు ఉచితంగా కంప్యూటరైజ్డ్ పరీక్షలు, మందులు, కళ్లద్దాలు పంపిణీ అవసరమైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు అందజేస్తున్నాము. ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయే కుమార్, డిప్యూటీ కలెక్టర్ ప్రతీక్ జైన్ , మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీపులాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి సుద్దాల లావణ్య మరియు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు . అర్కల కామేష్ రెడ్డి మరియు అనుబంధ సంఘాల నాయకులు మహిళా నాయకులు వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.