కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ సున్నం చెరువు పార్కులో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , ఏఈ రంజిత్, వర్క్ ఇన్స్పెక్టర్ వినాయకరావుతో కలిసి నూతనంగా 85 లక్షల వ్యయంతో జరుగుతున్న పార్కు అభివృద్ధి పనులను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహాయ సహకారాలతో నూతనంగా 85 లక్షల వ్యయంతో చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్స్, మరియు యోగ ప్లాట్ఫారం, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, సెక్యూరిటీ రూమ్ పనులను పర్యవేక్షించడం జరిగిందన్నారు. అలాగే పనుల్లో నాణ్యత పరిమాణాలు పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రజలకు అందుబాటులో తీసుకు రావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి, జ్ఞానేశ్వర్, టీవీఎస్ రాజు, యోగిరాజు, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.