తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ కార్యాలయంలో నిన్న జరిగినటువంటి సూర్యాపేట బహిరంగ సభ లో బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణనికి బిసి ముఖ్యమంత్రినినే చేస్తానని ప్రకటించడం తో రాజ్యసభ సభ్యులు, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ , బిజెపి రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్, హుజురాబాద్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ , మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ కి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మిఠాయి తినిపించుకొని సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికార బిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ తీరును ఎండగట్టారు.
వారసులను కూర్చోబెట్టడమే బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల లక్ష్యమని. బిఆర్ఎస్ ప్రభుత్వం బీసీల సంక్షేమం ఎందుకు వదిలేసిందన్నారు. తెలంగాణకు కాంగ్రెస్, బిఆర్ఎస్ ఏమీ చేయలేదని కేటీఆర్ ను సీఎం చేయాలని కెసిఆర్ యోచిస్తున్నారని. బిజెపి మాత్రమే పేదల సంక్షేమం కోసం ఆలోచిస్తుందని అన్నారు