SAKSHITHA NEWS

Rythu Bandhu Minister KTR for 60 lakh farmers

60 లక్షల మంది రైతులకు రైతుబంధు మంత్రి కేటీఆర్‌


*సాక్షిత : *రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇప్పటివరకు రూ.65 వేల కోట్ల రైతుబంధు సాయం అందించామని చెప్పారు. నిజామాబాద్‌ పట్టణంలో కాకతీయ స్యాండ్‌ బాక్స్‌ ఆధ్వర్యంలో జరిగిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

గత ఎనిమిదేండ్లలో 46 వేల చెరువులను పునరుద్ధరించామన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఇరిగేషన్‌ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని అతితక్కువ సమయంలో నిర్మించామన్నారు. 45 లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందుతున్నదని చెప్పారు.

2014లో తెలంగాణలో 68 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే పండిందని, 2022 నాటికి 3.5 కోట్ల టన్నులు పండించే స్థాయికి చేరుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో నష్టాల్లో ఉన్న విజయ డెయిరీ లాభాల బాటపట్టిందని తెలిపారు.

ఆయిల్‌పామ్‌ సాగుతో రైతులకు నిత్యం ఆదాయం సమకూరుతుందని చెప్పారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకునడుస్తున్నదని తెలిపారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నామన్నారు.


SAKSHITHA NEWS