SAKSHITHA NEWS

RTO office should be set up in Nagari

image 68

నగరి లో ఆర్టీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి………….. ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య , ఏ ఐ టి యు సీ నాయకులు భాషా వేలన్ డిమాండ్
చిత్తూరు జిల్లాలో నగరి నియోజకవర్గం నగరి లో ఆర్టీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో ట్యాక్సీ డ్రైవర్లు నగరి ఆర్డీవో కార్యాలయం దగ్గర టాక్సీ ఆటో వర్కర్స్ యూనియన్ కార్యదర్శి భాషా అధ్యక్ష తన ధర్నా నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ జిల్లాలు విభజన జరిగిన తర్వాత నగరి నియోజకవర్గాన్ని మూడు మండలాలు కలిపి చిత్తూరు జిల్లాలో కలపడం జరిగింది. జిల్లాలు విభజించినప్పుడు అధికారుల , రాజకీయ నాయకులు చూపించిన చొరవ నగిరి అభివృద్ధికి మాత్రం శ్రద్ధ చూపలేదు, పుత్తూరులో ఉన్న ఆర్టీవో కార్యాలయం నగిరి గా అందుబాటులో ఉన్నది.

జిల్లాలు విభజన తర్వాత చిత్తూరుకు మార్చడం జరిగింది చిత్తూరుకు వెళ్లి రావాలన్నా అనేక ఇబ్బందులు గురవుతూ ప్రజలు ,టాక్సీ డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు, ఎఫ్సీ చేసుకోవాలన్నా కొత్తగా ఎల్ఎల్ఆర్ తీసుకోవాలన్న ఒక్క రోజుకు రెండు మూడు రోజులు సమయం పడుతున్నది. అవునా అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ఆర్టీవో కార్యాలయం స్థానికంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

అధిక ఖర్చుతో కూడుకున్న పని ఒక పక్క డీజల్ పెట్రోల్ పెరుగుతో నిత్యవసర పెరుగుతూ, కుటుంబ భారంగా ఉన్న సందర్భంలో చిత్తూరుకు ఆర్టిఓ ఆఫీస్ ను వెళ్ళాలి అనడం అందరికీ ఇబ్బందిగా ఉన్నందున నగిరి లోనే ఆర్టీవో కార్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారుఆటో ట్యాక్సీ వర్కర్స్ యూనియన్ అని అధ్యక్ష కార్యదర్శులు షబ్బీర్ భాషా శేఖర్ మాట్లాడుతూ ఆటోలో టాక్సీలు ఎఫ్ సికి వెళ్లాలన్న అనేక ఇబ్బందులు పడుతున్నాము తమిళనాడు దాటుకొని వెళ్లాల్సిన పరిస్థితి కావున బాధలను గుర్తించి స్థానిక ఎమ్మెల్యే అధికారులు ఆర్టీవో కార్యాలయాన్ని నగిరిలో ఏర్పాటు చేయాలని కోరుతున్నాము,
అనంతరం ఆర్డిఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా ఆర్డీవో గారు మాట్లాడుతూ ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వానికి తెలియ పరచమని హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో ఏఐటిసి సీనియర్ నాయకులు వేలన్, ఆటో టాక్స్ అధ్యక్ష కార్యదర్శులు భాషా శేఖర్ ప్రసాదు సత్తార్, గోవింద్ రెడ్డి రాజా, ఆటో కార్మికులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS