సాక్షిత మంథని: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు నెలలు పూర్తి కాకముందే.. ఆరు గ్యారంటీల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్‌ను అమల్లోకి తీసుకొచ్చామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. హామీల అమలు భారాస నేతలకు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో ‘గృహ జ్యోతి’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు చుక్క నీరు రాలేదన్నారు. ‘‘ఇప్పటికైనా భారాస నేతలు మేడిగడ్డను సందర్శించారు. ప్రాజెక్టు సురక్షితం కాదని మేం కాదు.. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులే చెప్పారు. దీని నిర్మాణానికి రూపకల్పన చేసిన కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. మేడిగడ్డ మరమ్మతులు నిపుణుల సూచన మేరకు జరుగుతాయి. వారు వీరు చెప్పారని.. సలహాలపై మరమ్మతులు చేపడితే ప్రాజెక్టు మళ్లీ కుంగిపోతుంది. ఇంజినీర్లు, నిపుణుల సూచనల కోసం ప్రభుత్వం వేచిచూస్తుంది’’ అని శ్రీధర్‌బాబు తెలిపారు.